Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రాల్లోని పట్టణంలో నడి బొడ్డులో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్ డిమాండ్ చేశారు. గురువారం కాంగ్రెస్ పార్టీ, నిరసన తెలిపారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి పాలాభిషేకం చేశారు. నల్ల జెండాలతో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ ఉదయం సుమారు ఉదయం 10 గంటలకు దుండగుడు అంబేద్కర్ విగ్రహం పై దాడి చేస్తే పోలీసులకు సమాచారం ఇచ్చినా ఇంతవరకు గుర్తించి అరెస్ట్ చేయకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కొన్ని మత ప్రేరేపిత సంస్థలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాల పట్ల దేశంలో బహుజన ఉద్యమాలను నీరు కార్చడం కోసం అంబేద్కర్‌ను అవహేళన చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నాయకులు బట్టు ఉ రామచంద్రయ్య, బండారు రవి వర్ధన్, ప్రజా పర్యవేక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సిరిపంగ శివలింగం, మాదిగ విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఇంచార్జ్ ఇటుకల దేవేందర్, కొల్లూరు రాజు, సిరిపంగ చందు, జెరుపోతుల పరుశురాం, సందెల శ్రీనివాస్, కోళ్ల కష్ణ, కోళ్ల జహంగీర్, గుండె వంశీ,దర్లాయి దేవేందర్, అడ్వకేట్ శంకర్, విశాల్, సతీష్, బాసాని మహేందర్, బండారి జహంగీర్ పాల్గొన్నారు.