Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -చండూరు
మండలంలోని గట్టుపల్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ లైసెన్స్ రద్దు చేసి పనులను ఆపాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్గొండ జిల్లా కాలెక్టరేట్‌లో జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం , గట్టుప్పల సర్పంచ్ కుమారి ఇడం రోజా పుట్టపాక సర్పంచ్ సామల భాస్కర్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చేపడుతున్న ఫార్మా కంపెనీ వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. నీటి కాలుష్యంతో అనారోగ్య సమస్యలు వస్తాయని, చుట్టుపక్క గ్రామాలలో దాదాపు 15000 మంది చేనేత కార్మికులు జీవనోపాధి కోల్పోతారన్నారు. వెంటనే అనుమతులు రద్దు చేయలని వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలుపుతామన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో జీఎంఎస్‌ఎస్ కన్వీనర్ ఇడం కైలాసం, ఉప సర్పంచ్ నారని రామలింగం, భీమగని మహేశ్, మల్లేశం, మాదగని సువర్ణ బొల్లెపల్లి వెంకటేష్ గౌడ్, ఇడం వెంకటేష్, కౌడగని శేఖర్, చిలుకూరు అంజయ్య ఉన్నారు.