Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు గంధం ఊరేగింపు
- లక్షకు పైగానే హాజరు కానున్న భక్తులు
- హాజరు కానున్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు
- ఏర్పాట్లు పూర్తి చేశాం : వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ షేక్ మహమ్మద్
నవతెలంగాణ - పాలకవీడు
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన జాన్ పహాడ్ దర్గా ఉర్సు ఉత్సవ వేడుకలు గురువారం తెల్లవారుజామున గుసుల్ షరీఫ్ ప్రారంభమైనాయి . ఈ వేడుకను మూడు రోజుల పాటి ఎంతో వైభవంగా నిర్వహిస్తారు .మొదటిరోజు గుస్షుల్ షరీఫ్ రెండవరోజు గంధ ఊరేగింపు మూడవ రోజూ పూజలు నిర్వహించి సాయంత్రంవేళ చీకటి పడే సమయానికి దీపారాధన చేసి ఉర్సు వేడుకలకు ముగిస్తారు .
మొదటిరోజు గుస్షుల్ షరీఫ్ భాగంగా దర్గాలోని హజరత్ సయ్యద్ మొయినుద్దీన్ జాన్ పాక్ షాహిద్ రహమత్తుల అలై ,హజరత్ మొహినుద్దీన్ షాహిద్ సమాధుల తోపాటు దర్గా ఆవరణలోనే ఉన్న వారి మేనమామ బాల షాహిద్ సమాధులపై ఉన్నా చాదర్లను దట్టీలను దర్గా ముజావర్లు తొలగించి ఆ సమాధులను శుభ్రం చేసి నూతన దట్టీలను చాదర్లను కప్పి హైద్రాబాద్ నుండి తెచ్చిన వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి గంధం ఎక్కించి కొవ్వొత్తులు వెలిగించారు. అలాగే దర్గా ఆవరణలో ఉన్న సిపాయి సోలార్ సమాదులతో పాటు అక్కడ ఉన్న అమరుల సమాధులను శుభ్రం చేసి చదర్లను కప్పి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉర్సు వేడుకలను ప్రారంభించారు .అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పొట్టేళ్లను మేకపోతులతో కందుకూరు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకున్నారు .
గురువారం రాత్రి వక్ఫ్ బోర్డు నుండి తెచ్చిన గంధాన్ని వక్ఫ్ బోర్డు అధికారులు దర్గాలోని బాబా సమాధులపై ఎక్కించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.బుధవారం రాత్రి నుండే ఫకీరులు దర్గాకు చేరుకొని రాత్రంతా ఆటపాటలతో భక్తులను ఎంతగానో అలరింపజేశారు..
నేడు గంధం ఊరేగింపు
హైదరాబాద్ వర్క్స్ బోర్డు నుండి తెచ్చిన గంధాన్ని ముజావర్ల తెచ్చిన గంధాన్ని దర్గా కాంట్రాక్టర్లు తెచ్చిన గంధాన్ని దర్గాకు కొంత దూరంలో ఉన్న చందన్ ఖానలో పెట్టి దర్గా కు వచ్చే ప్రజాప్రతినిధులు అధికారులతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత గంధాన్ని బిందెలో పెట్టి దర్గా చుట్టుపక్కల గ్రామాలలో గుర్రంపై ఊరేగింపు చేసి దర్గాలోని బాబా సమాదులపై సమర్పిస్తారు.
లక్షకు పైగానే హాజరుకానున్న భక్తులు
ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం గంధం ఊరేగింపుకావడంతో విశేషం . ఉర్సు ఉత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరయ్యే అవకాశముందని వక్స్ బోర్డు అధికారులు తెలుపుతున్నారు .
హాజరుకన్నాను మంత్రి ఎంపీ ఎమ్మెల్యేలు
ఈ ఉత్సవాలలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్యయాదవ్ నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జిల్లా కలెక్టర్ వినరు కష్ణరెడ్డి ఎస్పీ భాస్కర్ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రముఖులు హాజరవుతున్నట్లు సమాచారం .
పలు ఏర్పాట్లు చేసిన డెక్కన్ పరిశ్రమ
డెక్కన్ సిమెంట్ పరిశ్రమ ఆధ్వర్యంలో 25 మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు డెక్కన్ పరిశ్రమ జనరల్ మేనేజర్ నాగమల్లేశ్వర రావు తెలిపారు .దర్గా ఆవరణలో 150 మీటర్ల డ్రైనేజీ నిర్మాణం పనులు చేపట్టామని అలాగే స్థాన్నాల గట్టల వద్ద 100 మీటర్ల ఫ్లోరిన్ చేయించినట్లు తెలిపారు .3 వాటర్ ట్యాంకర్ల ద్వారా మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నామని అలాగే ప్రభుత్వ సిబ్బందికి రూమ్స్ భోజనాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు .
దర్గా వద్ద పట్టుబడిన దొంగలు
దర్గా వద్ద భక్తుల వాహనాలను దొంగలించేందుకు ప్రయత్నించినా ఒక దొంగను పాలకవీడు పోలీసులు పట్టుకున్నట్లు ఎస్‌ఐ నరేష్ తెలిపారు .అతనిది నల్లగొండ జిల్లా పెద్దవూర మండలానికి క చెందిన అ రవిగా గుర్తించి అతనిపై కేసు నమోదు నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు.
ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాం ... వక్స్ ఇన్స్‌పెక్టర్ షేక్ మహమూద్
ఉర్సు ఉత్సవాలలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా చూస్తున్నాం . భక్తులకు దర్శనానికి ఇబ్బంది కలగకుండా బారి కేట్లను ఏర్పాటు చేయించాం .. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్గాను లోని బాబా సమాధులను దర్శించుకోవాలని సూచించారు .