Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ - మర్రిగూడ
దేశానికి అన్నం పెట్టే రైతు నేడు కన్నీరు కారుస్తు న్నాడని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మిక, కర్షక పోరు యాత్ర గురువారం మండల కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బస్టాండ్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం భూపాల్ మాట్లాడుతూ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదాని, అంబానీ లాంటి పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందే తప్ప రైతుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో సాగుతున్న ఆందోళనలో 121 మంది రైతులు మృత్యువాత పడటం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం, నాయకులు దాసరి పాండు, సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సోమన్న, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు ఏర్పుల యాదయ్య, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, నాయకులు గురుమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల వెంకట్రామ్, రైతు సంఘం జిల్లా నాయకులు నీలకంఠ రాములు, మండల నాయకులు తిప్పర్తి లింగయ్య, ఊరిపక్క బద్రి, గడగోటి వెంకటేష్, యేరుకొండ లచ్చయ్య, వీరమల్ల బిక్షం, పగిల్ల రామచంద్రం, గిరి, అలివేలు, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు.