Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థుల పాఠశాలలు, కళాశాలల సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం డిపో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈ సందర్బంగా ఆ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ధనియాకుల శ్రీకాంత్‌వర్మ మాట్లాడారు.జిల్లాకేంద్రంలో వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్ధులు విద్య నభ్యసించడానికి ప్రభుత్వం కల్పించిన బస్ పాస్ సౌకర్యాన్ని వందలాది రూపాయలు చెల్లించి తీసుకున్నప్పటికీ,వారి విద్యా సంస్థల సమయానికి అనుగుణంగా బస్సులు నడవకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు.సోమారం రూట్‌కు చెందిన పది గ్రామాల విద్యార్థులకు ఒకే బస్సు నడపడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలకు లోనవుతున్నారని తెలిపారు.ఈ రూటుకు సూర్యాపేట డిపో నుండి అదనపు బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.అదేమాదిరిగా ఇమాంపేట ఆదర్శ పాఠశాల కస్తూర్బాగురుకుల పాఠశాలకు కలిపి ప్రత్యేకమైన బస్ సౌకర్యం కల్పించాలని కోరారు.విద్యార్థుల సమస్యలను పరిష్కారం చేయాలని ఎన్నోమార్లు ఆర్టీసీ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డిపో కంట్రోలర్ వెంకటేశ్వర్లకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మనోహర్‌ప్రసాద్, వినరు,చంటి, జావీద్,సాయి, గోపి,సునీల్,భిక్షం, శ్రీలక్ష్మీ, భవాని,సౌజన్య పాల్గొన్నారు.