Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రాహ్మణ వెల్లంలలో చిరుత కలకలం
- అడుగులు చూసి హైనా అని నిర్ధారించిన అటవీశాఖ అధికారులు
- సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నద్ధం
నవతెలంగాణ - నార్కట్‌పల్లి
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో చిరుత సంచరిస్తోందనే పుకార్లు షికార్లు చేశాయి. ఇవిగో...అడుగులు..ఇక్కడే సంచరించిందని చెప్పడంతో గ్రామస్తులు ఉలిక్కి పడ్డారు. గ్రామానికి చెందిన గుత్తా వెంకట్‌రెడ్డి బావి వద్ద చిరుత పులి సంచరి స్తుందని తానే స్వయంగా చూశానని ఆయన శుక్రవారం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. జంతువు అడుగుల్ని పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడుగులను బట్టి అది చిరుత పులి కాదని, హైనా అని నిర్ధారించారు. అయినప్పటికీ గుత్తా వెంకట్‌రెడ్డి బావి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. గ్రామస్తులెవరూ భయభ్రాంతులకు గురి కావొద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఎస్‌ఎఫ్ అధికారి మల్లారెడ్డి, స్థానిక అధికారులు ఉన్నారు.