Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాసంఘాల డిమాండ్.
భువనగిరి:గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆమనగల్లులో ఆవు మాంసం తినే వారిని పరుషపదజాలంతో దూషించడం రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని వెంటనే అతనిని అదుపులోకి తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. సోమవారం భువనగిరిలో రాజా సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రధాని మోడీ నుండి రాజాసింగ్ వరకు ఉన్నటువంటి మతతత్వ హిందూ శక్తులకు గుణపాఠం చెప్పే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీచైర్మెన్ బర్రె జహంగీర్ ,దళిత ఐక్యవేదిక నాయకులు బట్టు రామచంద్రయ్య, కేవీపీఎస్ జిల్లా నాయకులు సిర్పంగి స్వామి, నాయకులు బండారు రవి వర్ధన్, శివలింగం, ఉదరు కుమార్, వనం రాజు, దేవేందర్, ఉప్పల శాంతికుమార్, శ్రీనివాస్, ఉదరు కుమార్ పాల్గొన్నారు.