Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మళ్లీ రూ.25 పెరిగిన వంట గ్యాస్ ధర
- పెరిగిన ధరలతో రూ.871.50 చేరిన గ్యాస్ సిలిండర్
- కొనలేం అంటున్న సామాన్యులు
- ఇక కట్టెల పొయ్యి మీదే వండుతామంటున్న మహిళలు
నవతెలంగాణ - నల్లగొండ
చమురు సంస్థలు వినియోగదారులకు షాపుల మీద షాకులు ఇస్తోంది. వంట గ్యాస్‌తో పాటు వంటగ్యాస్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రు.95 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే వంట గ్యాస్ ధరలను కేంద్రం రెండు నెలల కాలంలోనే నాలుగు సార్లు పెంచి సామాన్యులపై మోయలేని భారం వేసింది. డిసెంబర్ 1న సిలిండర్ ధర రు.595 ఉండగా ధర పెరగడంతో అది రూ.644కి చేరింది. అంటే రూ.49 పెంచిందన్నమాట. జనవరి 1వ తేదీన మరో సారి రూ.55 పెంచింది. ఇది చాలదన్నట్టు ఫిబ్రవరి 4వ తేదీన మరోసారి మళ్లీ రూ.20 పెంచి సామన్యులపై పెను భారం మోపింది. తాజాగా మార్చి 1వ తేదీన రూ.25 పెంచగా అసలు సిలిండర్ ధర ప్రస్తుతం రూ. రూ.871.50కు చేరింది. దీంతో పాటు వాణిజ్య సిలిండర్‌పై రూ.95 పెరగడంతో దాని ధర రు1,614కు చేరింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు సైతం రికార్డు స్థాయిలో పెరుగుతుండడంతో ఏం చేయాలో..తెలీక సామాన్యులు దిక్కుతోచని స్థితిలో పడి పోతున్నారు. గ్యాస్ పక్కన పెట్టి కట్టెల పొయ్యిపై వండుకుంటే ఖర్చు తగ్గుతుందని మహిళలు చెబుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.