Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
నకిరేకల్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ రణవీర్ హోట్కర్ హెచ్చరించారు. సోమవారం ఆయన స్థానికంగా విలేకర్లతో మాట్లాడారు. స్టేషన్ పరిధిలోని నకిరేకల్, శాలీగౌరారం, కట్టంగూరు, కేతెపల్లి మండలాల్లోని గ్రామాల్లో అక్రమంగా బెల్టుషాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. బెల్టుషాపులు నిర్వహిస్తున్న వారి సమాచారం తమకు అందించాలని కోరారు.
చండూరు :మండలంలో నవరాత్రి ఉత్సవాలు ముగిసేంతవరకు గ్రామాల్లో బెల్టుషాపులను బంద్ చేయాలని సీఐ చంద్రబానునాయక్ అన్నారు.సోమవారం వైన్స్ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే వ్యక్తికి ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించొద్దన్నారు. బెల్టు షాపులకు మద్యం విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ సమావేశంలో వైన్స్ యజమానులు పాల్గొన్నారు.