Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-క్లాక్‌టవర్
రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగుల ఆత్మహత్యలను ఆపాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి, జిల్లా అధ్యక్షులు నీలకంఠం రవి కోరారు.ఈ విషయమై సోమవారం పట్టణంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడారు. విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు ఉద్యమిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఉమ్మడిరాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రజలు ఇంటికో ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారని, వారి ఆశలు అడియాసల య్యాయని ఆరోపించారు. రాష్ట్రంలో 30 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీ చేయడం లేదన్నారు. వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల్లోనూ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మనగోటి రమేశ్, బొడ్డు శివ, రావిరాల వరప్రసాద్, శివశంకర్, శ్యాంసుందర్, శ్రీకాంత్, అంజిరెడ్డి, ఎడవెల్లి నగేశ్, మాతంగి రవీందర్, బుర్రి నర్సింహా పాల్గొన్నారు.