Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ మాజీ చైర్మెన్
కొలుపుల కమలాకర్
నవతెలంగాణ-భువనగిరి
భువనగిరి మత్స్య సొసైటీలు ఉన్న బోగస్ సభ్యులకు అండగా జిల్లా మత్స్యశాఖ అధికారులు వ్యవహరిస్తు వారి ద్వారా లబ్ది పొందుతున్నారని మున్సిపల్ మాజీ చైర్మెన్ కొలుపుల కమలాకర్ విమర్శించారు. శనివారం జిల్లా మత్స్యశాఖ కార్యాలయం భువనగిరి ఎదుట ముదిరాజ్ మత్స్య కార్మిక సంఘం ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోగస్ సభ్యులు ప్రభుత్వం నుండి వస్తున్న సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారన్నారు. అర్హులైన మత్య్స కార్మికులు ఉపాధి, కూడు, గుడ్డ లేక పేదరికంతో అల్లాడుతున్నారన్నారు. ముదిరాజ్ మత్స్య కార్మికులకు సభ్యత్వాలు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వు డబ్ల్యూపీ నెం.25397/10 జారీ చేసినా మత్స్య శాఖ అధికారులు నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్ల్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి పై కోర్టు దృష్టికి తీసుకువెళ్లి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. అనంతరం జిల్లా మత్స్యశాఖ అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కూర గోపాల్, చింతకాయల ఉపెందర్, జహంగీర్ పాల్గొన్నారు.