Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ డి.అమరుకుమార్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
హుజూర్‌నగర్ ఉపఎన్నికలో వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల ఖర్చును సరిపోల్చుకోవాలని కలెక్టర్ డి.అమరు కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో ఉప ఎన్నికలో పోటీ చేసిన అభ్యర్థుల ఖర్చులపై ఏర్పాటు చేసిన సమావేశంలో డీఆర్‌ఓ పి చంద్రయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలో పోటీచేసిన అభ్యర్థుల ఎన్నిక ఖర్చులో భాగంగా ఏఏ కార్యక్రమాలకు ఎంత ఖర్చు చేశారో ఆ ఖర్చులను సరిపోల్చుకోవాలన్నారు. ఈ నెల 19న వ్యయపరిశీలకులు అభ్యర్థుల ఖర్చుల బిల్లులను పరిశీలించుటకు జిల్లాకు రానున్నారని తెలిపారు. కావున ఎన్నికల నిబంధనలకు లోబడి పూర్తి వివరాలను అసలు ప్రతులతో సమర్పించాలని తెలిపారు. ముఖ్యంగా బుక్‌లెట్‌పై పోటీ చేసిన అభ్యర్థి సంతకం, అలాగే ప్రతీ బిల్లుపై ఏజెంట్ సంతకం తప్పనిసరిగా ఉండాలన్నారు. అభ్యర్థులందరూ 19న ఏర్పాటు చేసే సమావేశానికి తప్పక హాజరు కావాలని తెలిపారు. ఖర్చులు 30 రోజుల నిర్ణీత గడువులోపు అందచేయాలని సూచించారు. నామినేషన్ ఫీజును కూడా చూపాలన్నారు. అలాగే తమ బ్యాంక్ అకౌంట్ పుస్తకం, ఖర్చుల స్టేట్‌మెంట్ వివరాలను సమర్పించాలని తెలిపారు. ఎన్నికలో రూ.28 లక్షలు మించి ఖర్చు చేసి ఉంటే పోటీ చేసే అర్హతను కోల్పోతారన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ ఏడీ జి.ప్రసాదరావు, డీసీఓ ఎస్‌వీ ప్రసాద్, కృష్ణ, వివిధ పార్టీల పోటీ చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.