Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాజకీయాలకతీతంగా గ్రామాల అభివృద్ధి చేపడతామని మార్కెట్ చైర్మెన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని యాద్గార్‌పల్లి గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందన్నారు. గ్రామాలకు నిధులు కేటాయించి మౌళిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు. రాజకీయాలకతీతంగా గ్రామాల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దుండిగాల యాదమ్మ, ఉపసర్పంచ్ సుధాకర్, నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, సుగుణ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
నిడమనూరు : గ్రామాలు బాగుంటేనే అభివృద్ధి సాధ్యమౌతుందని ఎంపీపీ బొల్లం జయమ్మ అన్నారు. సోమవారం మండలంలోని ఊట్కూరు గ్రామంలో 14వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన డ్రెయినేజీ పనులను ఆమె ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాల్లో పంచాయతీలను అభివృద్ధి చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీడీటీసీ నందికొండ రామేశ్వరి, సర్పంచ్ నర్సింగ్ విజరుకుమార్, బొల్లం రవి, పంచాయతీ కార్యదర్శి అహల్య, నర్సింగ్ కృస్ణయ్య, నందికొండ మట్టారెడ్డి, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, శ్రీను పాల్గొన్నారు.