Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుద్ధవనం సందర్శన
- స్థూపాలు, ధ్యానవనం పరిశీలన
నవతెలంగాణ-నాగార్జునసాగర్
నాగార్జున సాగర్‌లోని హిల్ కాలనీలో నిర్మితమౌతున్న బుద్దవనాన్ని సోమవారం పలు దేశాలకు చెందిన పురాతత్వ శాస్త్ర వేత్తలు, చరిత్రకారులు, ఆచారులు సందర్శిం చారు. భారత్‌తో పాటు శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా కు చెందిన బౌద్ద శాస్త్రవేత్తలు, ఆచార్యులు, చరిత్రకారులు ప్రాజెక్టు కన్సల్టెంట్ ఎం.శ్రీ నివాస్ ఆధ్వర్యంలో సందర్శించారు. శ్రీపర్వ తారామంలోని గౌతమ బుద్దుడి పాదాలకు నమస్కరించి పూజలు నిర్వహిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ బౌద్ధమ తానికి సంబంధించి విశేషాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో బౌద్ధమతానికి సంబంధించి బౌద్ధక్షేత్రాలను సందర్శిస్తున్నామన్నారు. అనంతరం బుద్ధవనంలోని మ్యూజియం గోపురంపైన అమర్చిన శిల్పాలు, స్థూపపార్కు, ధ్యానవనం, బుద్దచరిత్రవనం, స్థూపపార్కు ప్రాంతాలను పరిశీలించారు. బుద్దవనంలో ఏర్పాటు చేసిన ఎత్తైన బుద్దుడి విగ్రహం వద్ద ఫొటోలు దిగుతూ సరదాగా గడిపారు. వారి వెంట బుద్దవనం ఎస్‌ఈ క్రాంతిబాబు, హోటల్ జీఎం నాదాస్, ప్రాజెక్టు కన్సల్టెంట్ శ్రీనివాస్, ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, డిజైన్ ఇన్‌చార్జి శ్యామ్, ఏఈ జగదీవ్, సాగర్ ఎస్సై శ్రీనయ్య, టూరిజం గైడ్ సత్యనారాయణ ఉన్నారు.