Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా చైర్మెన్ ఇరిగి కొటేశ్వరి
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలోని ప్రతి ఇంటికి రెడ్ క్రాస్ సొసైటీ సేవలను తీసుకెళ్లి విస్తృత పరచాలని రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మెన్ ఇరిగి కోటేశ్వరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జునియర్ కళాశాలలో రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచి ఆధ్వర్యంలో యూత్ రెడ్ క్రాస్ నమోదుతో పాటు విద్యార్థుల ఎన్ రోల్‌మెంట్ చేసి జూనియర్ రెడ్ క్రాస్‌పై నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే సామాజిక అంశాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, విద్యార్థులు సమాజంలో ఉన్నత విలువలున్న పౌరులుగా తీర్చిదిద్దడంలో రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ అమరు కుమార్ ఆదేశానుసారం ప్రత్యేక డ్రైవ్ ద్వారా రెడ్ క్రాస్‌లో విద్యార్థులను భాగస్వాములుగా చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో రెడ్‌క్రాస్ సేవలను భవిష్యత్‌లో రక్తదాన శిబిరాలు, యోగా, నేచర్ క్యూర్ సెంటర్స్, జనరిక్ మెడిసిన్, తలసేమియా హోం నర్సింగ్ కేర్ మొదలగు వాటి మీద కార్యక్రమాలను విస్తృత పరుస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిర్మల్ కుమార్, జేఆర్‌సీ వైఆర్‌సీ కో ఆర్డినేటర్ బైరు రమేష్, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రుద్రంగి రవి ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.