Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
ప్రపంచ మేధావి అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా జేసీ రమేష్ అన్నారు. శుక్రవారం భారత రత్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 63వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల నాయకులతో కలిసి నివాళులర్పించారు. దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులు బట్టు రామచంద్రయ్య, నాగారం అంజ య్య, బర్రె జహంగీర్, బర్రె సుదర్శన్, జిల్లా గ్రంథా లయాల చైర్మెన్ జడలఅమరేందర్ గౌడ్ పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అట్టడుగు వర్గాల్లో ఉదయించిన కిరణమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బట్టుపల్లి అనురాధ అన్నారు. శుక్రవారం వినాయక చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దాసరి పాండు, పట్టణ కార్యదర్శి కృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు చింతల కృష్ణయ్య, వెంకటేష్ నాయకులు అంజయ్య, వివేకానంద, కొండమడుగు నాగమణి, దాసరి మంజుల, కల్లూరి నాగమణి పాల్గొన్నారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు అన్నంపట్ల కృష్ణ, సిర్పంగి స్వామి జిల్లా ఉపాధ్యక్షులు దుండు గిరి, నాయకులు నిలిగొండ కిషోర్, వెంకటేశ్ పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌పై అగ్రహం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కనీస బాధ్యతగా మున్సిపల్ కమిషనర్ ఎలాంటి ఏర్పాట్లూ చేయకపోవడం పట్ల దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పై అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
వలిగొండ మండలం వర్కట్‌పల్లి గ్రామంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఆటోపై ఊరేగించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి సిర్పంగి స్వామి విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీసాల శేఖర్, నాయకులు నర్సింహ, కృష్ణ, యాదయ్య పాల్గొన్నారు.
నల్లగొండ: భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు.శుక్రవారం అంబేద్కర్ వర్థంతిని పురస్కరించుకుని పట్టణంలో ఆ సంఘం కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గాదె నర్సింహ,కిశోర్, కిరణ్, నాగయ్య,వెంకటేశ్వర్లు, వెంకటయ్య, శ్రీనివాస్,చింత వెంకన్న, యాదగిరి,పాలడుగు ప్రభావతి, అనురాధ పాల్గొన్నారు.
చిట్యాల : పలుకలు పంపిణీ చేశారు.కేవీపీఎస్ ఆధ్వర్యంలో మండలకేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి జిట్ట నగేష్ ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వృత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, జిట్ట సరోజ, బరాల యాదగిరి, సమాచార హక్కు వికాస సమితి మండల అధ్యక్షుడు రుద్రవరం కుమార్, బొడ్డు బాబురావు పాల్గొన్నారు.
చండూరు: కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ఉపేంద ర్‌రెడ్డి, డాక్టర్ నర్సింగరావు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్య క్షుడు బొట్ట శివకుమార్, మోదాల వెంకటేశం, టైలర్‌షాపు మండల అధ్యక్షుడు శంకర్ పాల్గొన్నారు.
నకిరేకల్ : పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యురాలు కందాల ప్రమీల, కేవీపీఎస్ మండల కార్యదర్శి వంటెపాక కృష్ణ, నాయకులు వంటెపాక వెంకటేశ్వర్లు,ఏర్పుల తాజేశ్వర్,ఎస్‌కె. అమీర్‌పాషా, ఎస్.నర్సింహ, శంకర్ పాల్గొన్నారు.
కేతెపల్లి: మండలకేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ ఎస్ జిల్లా నాయకులు బంటు మహేందర్, మండల అధ్యక్షుడు మారం వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల యూత్ ప్రెసిడెంట్ మీసాల ధనరాజ్, నాయకులు కొప్పుల ప్రదీప్‌రెడ్డి పాల్గొన్నారు.
మిర్యాలగూడ :కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యు లు రెమడాల పరుశురాములు, కోడిరెక్క మల్లయ్య, జయ, జనార్థన్, బొంగరాల వెంకటయ్య, ఓగోటి పూలమ్మ, శ్రీకాంత్ పాల్గొన్నారు.
నిడమనూరు : కేవీపీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను, ఎమ్మార్పీ ఎస్ జిల్లా కార్యదర్శి బొజ్జ చిన్న, మట్టయ్య పాల్గొన్నారు.
దామరచర్ల: మండలకేంద్రం, తాళ్లవీరప్ప గూడెంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ నాయకులు సైదులు, ఎమ్మార్పీఎస్ నాయకులు సదానందం, టీఆర్‌ఎస్ నాయకులు బాలశ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు చంద్రశేకర్ పాల్గొన్నారు.
వేములపల్లి: మండలంలోని మండలపరిషత్ కార్యాలయంలో, సీపీఐ(ఎం) కార్యాలయంలో, మొల్కపట్నం గ్రామంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో వర్థంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఇరుగు మంగమ్మ వెంకటయ్య, ఎంపీపీ పుట్టల సునీత కృపయ్య, వైస్ ఎంపీపీ పాదూరి గోవర్థన శశిధర్‌రెడ్డి, ఎంపీటీసీ చల్లబట్ల చైతన్య ప్రణీత్‌రెడ్డి, దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీరామ్‌రెడ్డి, ఝాన్సీ, ప్రవీణ్, అంకెపాక రాజు, రామచంద్రయ్య పాల్గొన్నారు.