Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.82 దాటిన పెట్రోలు
- రూ.72కు ఎగబాకిన డీజిల్
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి చమురు ధరలు రికార్డు స్థాయిని తాకాయి. రెండు రోజుల విరామం అనంతరం వరుసగా రెండో రోజైన శనివారం దేశీయ చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 24 పైసలు, డీజిల్‌పై 27 పైసల చొప్పున పెంచాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.82, డీజిల్ ధర రూ.72కు చేరి రికార్డు స్థాయిని తాకాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధరల రూ.81.89 నుంచి రూ.82.13కు, డీజిల్ రూ.71.86 నుంచి 72.13కు చేరాయి. నవంబర్ 20 నుంచి వరుసగా ఎనిమిది రోజుల పాటు చమురు ధరలు పెరిగాయి. ఈ తొమ్మిది రోజుల్లో లీటరు పెట్రోల్‌పై రూ.1.07, డిజీల్‌పై రూ.1.67 పెరిగాయి. ముంబైలో ఆదివారం పెట్రోల్ ధర లీటరుకు రూ.88.58 నుంచి రూ.88.81కు, డీజిల్ ధర రూ.78.38 నుంచి రూ.78.66కు పెరిగాయి. స్థానిక పన్ను, వ్యాట్ ఆధారంగా ఆయా రాష్ట్రాల్లో ధరలు మారుతూ ఉంటాయి.