Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈడీ తీరుపై కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ విమర్శలు
న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మేంట్ డైరెక్టరేట్ (ఈడీ) రాజకీయ ప్రతీకారానికి ఒక సాధనంగా మారిందని కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ విమర్శించారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన 'కేఐఐఎఫ్‌బీ' (కేరళ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ బోర్డ్) అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు సేకరించటంపై ఈడీ విచారణకు దిగింది. ఎలాంటి ఆధారాలూ లేకున్నా..తనకు తానుగా ఈడీ 'కేఐఐఎఫ్‌బీ'కి వ్యతిరేకంగా విచారణ చేపట్టడమేంటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై వివాదం రేపాలని కావాలనే కొన్ని విషయాల్ని ఈడీ మీడియాకు లీక్ చేస్తోందని అన్నారు. రాజకీయ ప్రేరేపిత చర్యలతో ఈడీ నడుచుకుంటోందన్న ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి రుణాలు తీసుకోవడానికి కేఐఐఎఫ్‌బీ.. ఆర్‌బీఐ అనుమతి పొందిందని, ఈ విషయం ఈడీకి కూడా తెలుసునని థామస్ ఐజాక్ అన్నారు. అయినప్పటికీ దీనిపై రాజకీయ దుమారం రేపాలని, తద్వారా ప్రయోజనం పొందాలనేది రాజకీయ శక్తుల ఉద్దేశమని ఆయన అన్నారు. దీనికి ఆజ్యంపోసే విధంగా ఈడీ వ్యవహరించటాన్ని ఆయన తప్పుబట్టారు.