Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ.బోబ్డేపై ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చేసిన ట్వీట్లపై కోర్టు ధిక్కరణ చట్టం ప్రకారం.. క్రిమినల్ కంటెప్ట్ ప్రొసీడింగ్స్‌కు అనుమతి ఇవ్వడానికి అటార్నీ జనరల్ (ఏజీ) కెకె. వేణుగోపాల్ నిరాకరించారు. ఇప్పటికే ఈ విషయంలో ప్రశాంత్ భూషణ్ క్షమాపణ చెప్పారని అటార్నీ జనరల్ గుర్తు చేశారు. ప్రశాంత్ భూషణ్‌పై ధిక్కార చర్యలు కోరుతూ.. న్యాయవాది సునీల్ సింగ్ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన ఏజీ, ఆ అభ్యర్థన సీaేఐ ఎస్.ఏ.బోబ్డే వ్యక్తిగత జీవితం పెండింగ్ కేసుతో ముడిపడి ఉందని పేర్కొన్నారు. కాన్హా జాతీయ పార్కు సందర్శనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్‌లో ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే ప్రయాణించారని అక్టోబర్ 21న భూషణ్ ట్వీట్ చేశారు. ఫిరాయింపులకు పాల్పడిన మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల కేసును తన ముందు ఉంచుకొని న్యాయమూర్తి ప్రభుత్వ హెలికాఫ్టర్ వాడడాన్ని ఆయన ప్రశ్నించారు.