Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణాల రేటు 0.37శాతం
న్యూఢిల్లీ : కోవిడ్-19 వైరస్‌ను నియంత్రించటంలో కేరళ విజయం దిశగా అడుగులు వేస్తోంది. రెండో ఉదృతిని (సెకండ్ వేవ్) అడ్డుకోవటం కోసం పినరయ్ విజయన్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జాతీయ స్థాయిలో కోవిడ్ మరణాల రేటు 1.37 శాతం ఉండగా, కేరళలో 0.37శాతం నమోదైనట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. నవంబరు 27నాటికి మరణాల రేటు...మహారాష్ట్రలో 2.6శాతం, గుజరాత్‌లో 1.9శాతం, కర్నాటకలో 1.3శాతం, తమిళనాడులో 1.5శాతం, ఢిల్లీలో 1.6శాతం, పశ్చిమ బెంగాల్‌లో 1.7శాతం నమోదైంది. కరోనా వైరస్ ధాటికి అనేక రాష్ట్రాలు అల్లాడుతున్న తరుణంలో, వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటంలో కేరళ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబడిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలోని ప్రజా ఆరోగ్య వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని దేశ, విదేశాల్లోని వైద్య నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు ప్రశంసించారు.
వైరస్ మొదటి ఉధృతిని నియంత్రించటమేగాక, రెండో ఉధృతిని ఎదుర్కోవడానికి కూడా సర్వసన్నద్ధంగా ఉన్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. గతకొన్నివారాలుగా వివిధ జిల్లాల్లో కరోనా కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పడుతోందని సమాచారం. అలాగే మరణాల రేటు కనిష్టస్థాయికి చేరుకుంది. భారత్‌లో మొట్టమొదటి కరోనా కేసు ఈ ఏడాది జనవరి 30న కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ నవంబరు 27నాటికి కరోనాబారిన పడ్డవారి సంఖ్య 5,87,707కు పెరిగింది. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 63,885కు చేరుకుంది.49మంది వైద్య సిబ్బంది కరోనాబారిన పడ్డారు.