Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరువనంతపురం : మంగళవారం నుంచి కేరళలో భారీ వర్షాలు, భారీ గాలులు వీస్తాయనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖతో కలిసి కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారటీ (కేఎస్‌డీఎంఏ) హెచ్చరించింది. మంగళవారం నుంచి మళ్లీ ఆదేశాలు వచ్చే వరకూ చేపల వేటపై కేఎస్‌డీఎంఏ నిషేధం విధించింది. సోమవారం రాత్రి నుంచే సముద్రానికి దూరంగా ఉండాలని జాలర్లకు సూచించింది. అలాగే సహాయ శిబిరాల ఏర్పాట్లు ప్రారంభించాలని రెవెన్యూ, స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం బుధవారం నాటికి దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశ ఉంది.