Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలకు హోంశాఖ లేఖ
న్యూఢిల్లీ: రాజ్‌కోట్, అహ్మదాబాద్‌లో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఆస్పత్రుల ప్రాంగణాల్లో అగ్నిమాపక రక్షణ వ్యవస్థను తనిఖీ చేయాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజరు భల్లా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సోమవారం ఒక లేఖ రాశారు. ఇటీవల రాజ్‌కోట్‌లోని ఆస్పత్రిలో ఐసియులో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు రోగులు మర ణించారు. దీనికి కొద్ది రోజుల ముందు అహ్మదాబాద్‌లో చోటు చేసుకున్న ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దేశంలో కోవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో ఇటువంటి ఘటనలను నివారించడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని భల్లా లేఖలో పేర్కొన్నారు. హోం వ్యవ హారాల మంత్రిత్వ శాఖలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫైర్ విభాగం రాష్ట్రా లకు క్రమం తప్పకుండా సలహాలు జారీ చేస్తోందని, ఆస్పత్రి భద్రతపై విపత్తు నిర్వహణ అథారిటీ(ఎన్‌డిఎంఎ) మార్గదర్శకాలు పాటించాలని కోరారు.