Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్త నిరసన కార్యాచరణకు పార్టీ శాఖలకు పిలుపు
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతాంగం సాగిస్తున్న పోరాటానికి వామపక్షాలు తమ పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటించాయి. ఈ మేరకు సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్), ఆర్‌ఎస్‌పీ, ఏఐఎఫ్‌బీలు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అప్రజాస్వామిక రీతిలో ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదింపజేసుకున్న మూడు వ్యవసాయ బిల్లులను, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకుని తమ నిరసన
తెలియచేస్తున్నారని వామపక్షాలు పేర్కొన్నాయి. ఒకవైపు తీవ్ర చలితో పాటు అత్యంత పాశవికంగా అణచివేత చర్యలకు పాల్పడుతున్న ప్పటికీ.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని లక్షలాది మంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారని వామపక్షాల నేతలు సీతారాం ఏచూరి, డి.రాజా, దీపాం కర్ భట్టాచార్య, దేవవ్రత బిశ్వాస్, మనోజ్ భట్టాచార్యలు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గతంలో ప్రకటించినట్టుగా వారిని పార్లమెంట్ వద్దకు చేరేందుకు అనుమతించలేదని తెలిపారు. ఈనేపథ్యంలో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పలు రూపాల్లో సంయుక్తంగా సంఘీభావ నిరసన కార్యాచరణ చేపట్టాల్సిందిగా వామ పక్షాలు దేశవ్యాప్తంగా గల తమ శాఖలకు పిలుపునిచ్చాయి. రైతు సం ఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు లకు మద్దతునివ్వాలని కోరాయి. భారత వ్యవసాయరంగాన్ని, మన ఆహార భద్రతను పరిరక్షించేందుకు, రైతులకు ప్రోత్సాహక ధరలు అం దించేందుకు, కృత్రిమంగా ఆహార కొరతను నివారించేందుకు, నిత్యావ సరాల ధరలను పెంచడాన్ని నిరసిస్తూ రైతులు చేస్తున్న డిమాండ్లను ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం అంగీకరించాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.
రైతుల గొంతుకను వినండి
రైతుల గొంతుకను వినాలని వామపక్షాల నేతలతో సహా ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, డీఎంకెే కోశాధికారి టి.ఆర్.బాలు ,ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ఝాలు ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.