Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రివర్స్ ట్రాన్‌స్క్రిప్టేజ్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ (ఆర్‌టీ-పీసీఆర్) కోవిడ్ పరీక్ష ధరను రూ.800గా ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రజలు ప్రయివేటు ల్యాబ్‌ల్లో ఆర్‌టీ-పీసీఆర్ పరీక్ష కోసం రూ.2,400 ఖర్చు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోవిడ్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నా...ప్రయివేటు ల్యాబుల్లో చేయించుకోవాలనుకునే వారికి అవకాశం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేజ్రీవాల్ సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్రయివేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకునే వారికి తాజా నిర్ణయం ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో కోవిడ్ పాజిటివ్‌ల సంఖ్య 5.6లక్షలకు చేరువలో ఉంది. మరణాలు 9 వేల మార్క్‌ను దాటిన నేపథ్యంలో పరీక్షల ధరలు తగ్గించాలని నిర్ణయించారు. ఆదివారం కొత్తగా 4,906 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఢిల్లీలో కోవిడ్ 68 మరణాలు సంభవించాయి.