Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వానికి రూ.300, ప్రయివేటుకైతే రూ.1000 : సీరం
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను చేరవేయడమే తమ లక్ష్యమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. అలాగే, కరోనా వ్యాక్సిన్ ధరకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తొలి 100 మిలియన్ డోసుల (10 కోట్ల డోసులు) వ్యాక్సిన్‌ను ప్రభుత్వానికి రూ.200 చొప్పున విక్రయిస్తున్నామని చెప్పారు. దేశంలోని సామాన్య ప్రజలు, అణగారిన వర్గాలు, నిరుపేదలు, వైద్యసిబ్బందికి తమ వంతు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తొలి 10 కోట్ల డోసుల తర్వాత రూ.300లకు అందిస్తామని తెలిపారు. ఇక ప్రయివేటు మార్కెట్‌లో అయితే రూ.1000 ఒక్కో డోసును విక్రయిస్తాని పూనావాలా తెలిపారు.
ప్రభుత్వానికి ఉచితంగా 16.5 లక్షల కోవాగ్జిన్ వ్యాక్సిన్లు
భారత్ బయోటెక్ 16.5 లక్షల కొవాగ్జిన్ వ్యాక్సిన్లను ఉచితంగా ఇవ్వనున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తన వ్యాక్సిన్ ఒక్కో డోసును రూ.295కు ప్రభుత్వానికి అమ్ముతోందన్న వార్తల నేపథ్యంలో ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చింది. 16.5 లక్షల డోసులు ఉచితంగా ఇచ్చిన తర్వాత మరో 38.5 లక్షల డోసులు ఒక్కోదానికి రూ.295 వసూలు చేస్తోందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆ లెక్కన మొత్తం 55 లక్షల డోసులకు తీసుకుంటే.. ఒక్కో డోసు ఖరీదు రూ.206 మాత్రమే అవుతుందని తెలిపింది. ఈ నెల 14లోపు 100 శాతం వ్యాక్సిన్ డోసులు అందనున్నట్టు చెప్పింది.