Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సంతాపం
న్యూఢిల్లీ : ప్రముఖ కమ్యూనిస్టు నేత, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ మాజీ సభ్యులు గణేష్ శంకర్ విద్యార్ధి (96) కన్నుమూశారు. అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం పాట్నాలోని ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం రాత్రి మరణిం చారు. గణేష్ శంకర్ విద్యార్థి 17 ఏండ్ల వయస్సులోనే విద్యార్థిగా ఉన్న సమయంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో 1942లో సాధారణ సభ్యునిగా చేరిన ఆయన తర్వాత సీపీఐ(ఎం) బీహార్ రాష్ట్ర కార్యదర్శి స్థాయికి ఎదిగారు. అనేక సంవత్సరాల పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా పని చేశారు. భూస్వామ్య కుటుంబం నుంచి వచ్చినా ఆయన భూమిలేని నిరుపేద రైతుల హక్కుల కోసం పోరాటాలు జరిపారు. ఆరేండ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. గణేష్ శంకర్ విద్యార్ధి మృతికి సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సంతాపం ప్రకటించింది.