Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మరాఠీ మాట్లాడే ప్రజలు, కర్నాటక వివాదంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం 17న అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) ట్వీట్ చేశారు. కర్నాటక ఆధీనంలోని మరాఠీ మాట్లాడే సంస్కృతిని ఆచరించే ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపడమే అమరవీరులకిచ్చే నిజమైన నివాళని, అందుకు తాము కట్టుబడి ఉన్నామని, అమరవీరుల గౌరవ సూచికంగా ఈ వాగ్దానం చేస్తున్నామంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కర్నాటక పరిధిలోని బెల్గాం, ఇతర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే ప్రజలున్నారు. ఈ ప్రాంతాలు ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేవి. ఈ ప్రాంతాలను తిరిగి మహారాష్ట్రలో కలపాలంటూ మహారాష్ట్ర ఏకీకరణ సమితి సంవత్సరాలుగా పోరాడుతున్నది. ఈ డిమాండ్‌పై 1956 జనవరి 17న జరిగిన ఘర్షణలో పలువురు మరణించారు. దీనికి గుర్తుగా జనవరి 17ను అమరవీరుల దినంగా పాటిస్తున్నారు.