Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బాలాకోట్ దాడులు, ఆర్టికల్ 370 రద్దు గురించి బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బీఏఆర్‌సీ) మాజీ సీఈఓ పార్దో దాస్‌గుప్తా, రిపబ్లికన్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామి మధ్య వాట్సాప్ వేదికగా జరిగిన సంభాషణలు వెలుగు చూడటంతో రాజకీయ దుమారం చెలరేగుతున్నది. అర్నబ్ సందేశాలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీని కుట్రకోణం చూడాలని సూచించాయి. కాగా, దీనిపై అధికార బీజేపీ ప్రభుత్వం మౌనం వహిస్తున్నది. అర్నబ్ వాట్సప్ సంభాషణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరపాలని మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పి.చిదంబరం, ఎంపి మనీష్ తివారీ డిమాండ్ చేశారు.