Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్య ప్రదేశ్‌లో మహిళలపై వరుస దాడులు
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో కామాంధులు రెచ్చిపోతున్నారు. కొత్త ఏడాది మొదలై 20 రోజుల కూడా గడవకుండానే నాలుగు కేసులు నమోదయ్యాయంటే .. రాష్ట్రంలో మహిళలు, బాలికలు, యువతుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మానవ సమాజం సిగ్గుపడేలా తొమ్మిది మంది మృగాళ్లు ప్రవర్తించిన తీరు విస్మయానికి గురిచేస్తున్నది. ఒకింత ఆందోళనకు గురి చేస్తున్నది. 13 ఏండ్ల బాలికపౖౖె తొమ్మిది మంది కామాంధులు సామూహిక లైంగికదాడికి ఒడిగట్టిన ఘటన ఉమారియా జిల్లాలో జరిగింది. ఐదు రోజుల్లో రెండు సార్లు తనపై జరిగిన ఈ ఘోర కలిని తట్టుకోలేక ఆ బాలిక తల్లడిల్లిపోయింది. ఇప్పటి వరకు ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా 'సమ్మాన్' పేరుతో 15 రోజుల పాటు అవగాహన డ్రైవ్‌ను శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న సమయంలోనే ఈ అమానుషం చోటుచేసుకోవడం గమనార్హం.