Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన సీపీఐ(ఎం), కాంగ్రెస్ నేతలు ఆదివారం సమావేశమ య్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అంశంపై జరిగిన ఈ భేటీలో చర్చలు సానుకూలంగా జరిగాయని బెంగాల్ పీసీసీ అధ్యక్షులు అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. ఇరు పక్షాల మధ్య మరిన్ని చర్చలు అవసరమని లెఫ్ట్ ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బోస్ ఈ భేటీలో పేర్కొన్నట్టు చౌదరి చెప్పారు. ఈ సమావేశంలో లెఫ్ట్‌ఫ్రంట్ నాయకులు సూర్యకాంత్ మిశ్రా, కాంగ్రెస్ నేత అబ్దల్ మన్నన్ తదితరులు పాల్గొన్నారు.