Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
మేము సైతం | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 19,2021

మేము సైతం

- ఘనంగా కిసాన్‌ మహిళా దివస్‌
- దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో కార్యక్రమం
- మహిళల నేతృత్వంలో ఆందోళన
- ప్రధాని మోడీకి రైతు నేతల లేఖ
- 54వ రోజు కొనసాగిన అందోళన
- అపూర్వ ట్రాక్టర్ల పరేడ్‌ జరిగితీరుతుంది : ఏఐకేఎస్సీసీ
- 20న మరోసారి చర్చలు
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మహిళా రైతులు నినదిస్తున్నారు. మహిళా రైతు దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన ఆందోళనల్లో మహిళలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయ్యారు. నిరాహార దీక్షల్లో కూడా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 300 జిల్లాల్లో మహిళ కిసాన్‌ దివస్‌ జరిగింది. సుప్రీంకోర్టులో మహిళల భాగస్వామ్యం పట్ల ప్రతికూల వ్యాఖ్యలతో విసుగు చెందిన మహిళా రైతుల బృందం గుజరాత్‌, మహారాష్ట్ర నుంచి షాజహాన్‌పూర్‌కు బయలుదేరింది. మహారాష్ట్ర, గుజరాత్‌ నుంచి వేలాది మంది మహిళలు షాజహన్‌పూర్‌ చేరుకుని, ఆందోళనలో చేరారు. సరిహద్దుకు సమీపంలోని మహిళలు ట్రాక్టర్‌ మార్చ్‌ ద్వారా ఉద్యమంలో పాల్గొన్నారు.
మహిళా రైతు దినోత్సవం సందర్భంగా షాజహన్‌పూర్‌ వద్ద మహి ళల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, ప్రసంగాలు జరిగాయి. అధ్యక్ష వర్గంలో ప్రతిభా షిండే, చంద్రకాల, నిషా, రాజ్‌బాలా, వర్షా దేశ్‌పాండే ఉన్నారు. వక్తలలో రుక్మణి, వర్షాచోప్రా, సుమిత్రాచోప్రా, కవిత శ్రీవాస్తవ, సునీతా చతుర్వేది, ప్రతిభా షిండే, రైజాబాయి, మంజుయాదవ్‌ ఉన్నారు. ఉద్యమంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని వక్తలు పిలుపునిచ్చారు. వ్యవసాయంలోనూ, ఉద్యమంలోనూ మహిళల ప్రత్యేక స్థానం దృష్ట్యా సంయుక్త కిసాన్‌ మోర్చా జనవరి 18న మహిళా రైతు దినోత్సవంగా జరుపుకుంటామని ప్రకటించింది. మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం కొనసాగుతున్నది. కొత్తగా అనేక మంది రైతులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న రైతుల ఆందోళన సోమవారం నాటికి 54వ రోజుకు చేరుకుంది.
పదో విడత చర్చలు 20న
రైతులకు, కేంద్ర ప్రభుత్వానికి నేడు (బుధవారం) మరోసారి చర్చలు జరగనున్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లేదు. రైతు నేతలు, ప్రభుత్వం ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో పదోసారి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన భవన్‌లో మరోసారి చర్చలు జరగనున్నాయి. రైతు నేతలు తమ డిమాండ్లపై స్పష్టంగా ఉన్నారు.
అపూర్వ పరేడ్‌ జరిగితీరుతుంది: ఏఐకేఏస్సీసీ
అపూర్వమైన కిసాన్‌ రిపబ్లిక్‌ పరేడ్‌ ఢిల్లీలో జరిగితీరుతుందని ఏఐకేఏస్సీసీ తెలిపింది. చాలా జిల్లాలు వేలాది మందిని సమీకరించడంతో ప్రపంచంలోని ఏ దేశంలోని రైతులు తాము ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటివరకు చేయని అతిపెద్ద నిరసన అని పేర్కొంది. చట్టాలు ఉపసంహరించుకునే వరకు ఉద్యమం విస్తరిస్తూ, తీవ్రతరం చేస్తామని స్పష్టం చేసింది.
మోడీకి రైతు నేతల లేఖ
మహిళా కిసాన్‌ దివస్‌ సందర్భంగా ప్రధాని మోడీకి రైతు నేతలు లేఖ రాశారు. దేశంలో వ్యవసాయ రంగంలో 75 శాతం వ్యవసాయ పనులు స్త్రీలే చేస్తున్నారని గుర్తుచేశారు. రైతు వ్యతిరేక చట్టాలు మహిళా రైతులపై అత్యంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అన్నారు. ఈ సందర్భంగా రైతు నేతలు పలు డిమాండ్లను ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. 60 ఏండ్లు పైబడిన మహిళా రైతులకు నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ ఇవ్వాలని, వారి భౌతిక సామర్థ్యానికి అనుగుణంగా తక్కువ ధరలో వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. మహిళా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రాయితీతో ఇవ్వాలని, కూరగాయలు, పండ్లు, మహిళా రైతులు ఉత్పత్తి చేసే పాలను మద్దతు ధర వద్ద ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి ఉచిత వాహన సదుపాయాలు కల్పించాలని, భూమిలేని మహిళా రైతులకు కనీసం ఒక హెక్టార్‌ ప్రభుత్వ భూమిని కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆవులు, గేదెలు, మేకలను మహిళా రైతులకు ఉచితంగా అందించాలని అన్నారు. మహిళా రైతుల సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని, వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు అందుబాటులో ఉంచాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల మహిళలకు రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..

తాజా వార్తలు

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.