Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో తొలి 'లవ్ జిహాద్' కేసు నమోదైంది. 25 ఏండ్ల ఓ యువకుడిపై బాధిత యువతి (22) చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్రంలో శివరాజ్‌సింగ్ చౌహాన్ సర్కారు ఇటీవల మత స్వేచ్ఛ చట్టం 2020ని అమలులోకి తీసుకొచ్చిన తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బర్వానీ జిల్లా కొత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదైంది. పాల్సద్ బ్లాక్ మేనీ మాతా గ్రామానికి చెందిన యువతికి 2016లో ఓ వేడుకలో యువకుడు పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య ప్రేమ కొనసాగింది. అయితే సదరు యువకుడు తన అసలు పేరును యువతి ముందు దాచిపెట్టాడు. వేరొక పేరుతో యువతికి దగ్గరై శారీరకంగా లోబర్చుకున్నాడు. అయితే, సదురు యువకుడు తనను మోసం చేశాడని గ్రహించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీ సులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని కొత్వాలీ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్ యాదవ్ తెలిపారు. కాగా, వివాదాస్పద మతస్వేచ్ఛ చట్టంను మధ్యప్రదేశ్ ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌లో ఆర్డి నెన్సు తీసుకురాగా.. రాష్ట్ర గవర్నర్ ఈనెల 9న దానికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనిని 'లవ్ జిహాద్ చట్టం' గా కూడా పిలుస్తారు. ఎవరైనా వ్యక్తి తన పేరు మార్చుకొని మహిళలను ప్రేమ పేరుతో బలవంతంగా మతం మార్చితే ఈ చట్టం కింద శిక్షార్హులు అవుతారు.
అయితే, ఈ చట్టంపై ఇప్పటికీ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.