Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
తిరువనంతపురం : కేరళ రాష్ట్రానికి చెందిన ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల అధికారి(సీఈఓ) తీకా రామ్‌మీనా గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 2,67,31,509 మంది ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. వీరిలో 1,37,79,263 మంది మహిళలు కాగా, 221 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 2.99 లక్షల మంది ఓటర్లు 18-19 మధ్య వయస్సు ఉన్నవారేనని, వీరంతా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటేయనున్నారని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీనా మాట్లాడుతూ యువ ఓటర్ల లో ఎక్కువ శాతం కోజికోడ్ జిల్లాలో ఉన్నారని చెప్పారు. 'ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చాలని డిసెంబర్ 31 నాటికి 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఆన్‌లైన్ ప్రక్రియను మేం ముగించట్లేదు. నామినేషన్ల ఉపసంహరణకు 10 రోజుల ముందు వరకు ప్రజలు తమ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు' అని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.