Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు క్వారీ కార్మికులు మృతి
బెంగళూరు : కర్నాటకలోని శివమొగ్గ జిల్లాలో సంభవించిన భారీ పేలుడులో ఆరుగురు క్వారీ కార్మికులు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. శివమొగ్గకు ఏడు కిలోమీటర్ల దూరంలోని హున్సోడ్ గ్రామ సమీపంలో ఉన్న గ్రానైట్ క్వారీ వద్ద రాత్రి 10.30 సమయంలో ఈ పేలుడు జరిగింది. ఒక లారీలో ఉన్న జిలెటిన్ స్టిక్‌లు లేదా పెద్దరాళ్లను బ్లాస్ట్ చేసే పదార్థాలు పేలడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. మంటల్లో చిక్కుకొని వాహనం పూర్తిగా కాలిపోయింది. మృతుల్లో బీహార్‌కు చెందిన కార్మికులు కూడా ఉన్నారు. పేలుడు ప్రభావంతో సమీప ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భూకంపమేమోననే భయాందోళనతో ప్రజలు ఇండ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లలో కిటికీ అద్దాలు పగిలిపోవడంతో పాటు రోడ్లు నెర్రెలు ఇచ్చాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు కర్నాటక సీఎం యడియూరప్ప ప్రకటించారు.