Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీహార్ సీఎం అవినీతి చక్రవర్తి : తేజస్వీ యాదవ్
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌పై ప్రతిపక్ష నేత ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చేరిగారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటూ సీఎం నితీశ్‌కు సవాల్ విసిరారు. ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోవాలని సీఎం నితీశ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం పై ఉన్న అభిప్రాయాన్ని తెలియజేసే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ తేజస్వి యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీఎం నిర్ణయం సరైందికాదంటూ ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రిపై ఘాటు విమర్శలు చేశారు. నితీశ్ అవినీతి భీష్మ పితామహ అంటూ విమర్శ చేసిన తేజస్వి యాదవ్.. మీకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్ చేశాను.. దమ్ముంటే తనపై చర్యలు తీసుకోవాలని సీఎంకు సవాల్ విసిరారు. ''నితీశ్ అవినీతి చక్రవర్తి, 60 కుంభకోణాల్లో నేరస్తుడు, అవినీతి భీష్మ పితామహుడు, క్రిమినల్స్‌ని కాపాడేవాడు'' అంటూ ట్వీట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వంలో బలహీన ముఖ్యమంత్రి నితీశ్ అంటూ ఎద్దేవా చేశారు. అసలు బీహార్ పోలీసులే అవినీతికి పాల్పడుతూ.. లిక్కర్ అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టుపెడితే చర్యలు తీసుకోవాలని సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకే తనను అరెస్ట్ చేయాలని నితీశ్‌కి సవాల్ విసురుతున్నా' అని మరో ట్వీట్ చేశారు. అలాగే, ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి ప్రతిపక్షనేతల దగ్గరకు రాకుండా చేస్తున్నారు. నితీశ్ జీ మీరు అలసిపోయారని నమ్ముతున్నాం.. కొంత సిగ్గుపడుతున్నాం అంటూ తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు.