Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం తీరును తప్పుబట్టిన సోనియాగాంధీ
- చట్టాల్ని పూర్తిగా రద్దుచేయాల్సిందే
- ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణకు ఎప్పుడూ వ్యతిరేకమే..
న్యూఢిల్లీ : కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సోనియాగాంధీ సీడబ్ల్యూసీ వేదికగా స్పందించారు. రైతుల విషయంలో కేంద్రం అహంకారపూరితంగా వ్యవహరిస్తోం దని మండిపడ్డారు. కేంద్రం హడావిడిగా ఈ చట్టాలను తీసుకొచ్చిందని ఇట్టే అర్థమైపో తుందని, ఈ చట్టాల్లో ఉన్న లోతుపాతులను, లాభనష్టాలను పార్లమెంట్ చర్చించే అవకా శాన్ని కూడా కేంద్రం కల్పించలేదని సోనియా విమర్శించారు. కాంగ్రెస్ విధానం మాత్రం ఈ చట్టాల విష యంలో మొదటి నుంచి చాలా స్పష్టంగానే ఉన్నదని ఆమె కుండబద్దలు కొట్టారు. ''రైతు చట్టాల విషయంలో మనవిధానం మొదటి నుంచి చాలా స్పష్టంగానే ఉంది. మొదటి నుంచి వాటిని వ్యతిరేకిస్తూనేఉన్నాం. ఆహార భద్రతలో మౌలిక సూత్రాలైన కనీస మద్దతుధర, పంట ఉత్పత్తుల కొను గోళ్లు, పౌరసరఫరా లాంటి వ్యవస్థల్ని ఈ చట్టాలు సర్వ నాశనం చేస్తాయి''అని వివరించారు. నూతన వ్యవ సాయ చట్టాల్ని పూర్తిగా రద్దుచేయాలని సీడబ్ల్యూసీ తీర్మానం చేసింది. దేశ ఆర్థికపరిస్థితిని మోడీ సర్కార్ చక్కదిద్దలేక పోయిందని, ఇప్పటికీ ఆర్థికరంగంలో అనేకరంగాలు కోలుకోలేదని, ఎంఎస్‌ఎంఈ, అసంఘ టిత రంగాలకు ప్రభుత్వ తోడ్పాటు లేక దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రభుత్వ సంస్థల ప్రయివేటీకరణను కాంగ్రెస్ ఎప్పుడూ మద్దతు పలకదని తెలిపారు.