Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గన్‌తో గురిపెట్టాలని ఆదేశం
- అనుమానితుడు అదుపులోకి..
సింఘు సరిహద్దుల్లో ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకు న్నారు. రైతు ఉద్యమాన్ని దెబ్బతీసేలా రైతు సంఘాల నాయకు లను టార్గెట్ చేసినట్టు సమాచారం. కిసాన్ పరేడ్ రోజున తుపాకీ తో చంపేయాలని ఆదేశాలిచ్చినట్టు ఆనిందితుడు తెలిపాడు. సరిగ్గా కేంద్రంతో చర్చలు విఫలమైన కొద్ది గంటల్లోనే అనుమానస్పదంగా రైతులు ధర్నా చేస్తున్న ప్రాంతంలో పట్టుబడటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఢిల్లీ అల్లర్లలో బీజేపీ నేతల పాత్ర ఉంటే ఇప్పుడు రైతు ఉద్యమాన్ని దెబ్బతీసేలా వెనుక ఉన్నది? బీజేపీనా లేక కార్పొరేట్లా ఎవరన్నదే ఇపుడు సస్పెన్స్.