Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోవిడ్-19 లాక్‌డౌన్ కారణం !
న్యూఢిల్లీ : కోవిడ్-19 కారణంగా మోడీ సర్కార్ ఏకపక్షంగా విధించిన లాక్‌డౌన్ లక్షలాదిమంది రైతులకు సంక్షేమ ఫలాల్ని దూరం చేసింది. అందుకు నిదర్శనం..పీఎం కిసాన్ పథకం అమలు జరిగిన తీరు తెలియజేస్తోంది. గత ఏడాది మార్చి-జులై 31 మధ్య విధించిన కఠినమైన లాక్‌డౌన్ దెబ్బకు దేశ రైతాంగం విలవిల్లాడింది. లాక్‌డౌన్ సమయంలో పీఎం కిసాన్‌కు సంబంధించి 11.2లక్షల నగదు బదిలీ లావాదేవీలు విఫలమయ్యాయని అధికారిక సమాచారం విడుదలైంది. దీనివల్ల లక్షలాది మంది రైతుల ఖాతాల్లో ప్రభుత్వ సాయం జమకాలేదని కేంద్ర వ్యవసాయ శాఖే ఒక ఆర్టీఐ దరఖాస్తుకు సమాచారం విడుదల చేసింది. దీనిని గుర్తించిన తర్వాతైనా నగదు బదిలీ పొందని రైతులకు సాయం అందిందా? అంటే అదీ లేదు. లావాదేవీలు విఫలమైనవాటిలో 44శాతం పరిష్కారానికి నోచుకోలేదని కేంద్ర వ్యవసాయశాఖ స్వయంగా వెల్లడించింది.
కామన్‌వెల్త్ హ్యూమన్‌రైట్స్‌కు చెందిన వెంకటేష్ నాయక్ అనే సామాజిక కార్యకర్త వేసిన ఆర్టీఐ దరఖాస్తుకు పై సమాచారాన్ని కేంద్రం విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖలోని చీఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి విడుదల చేసిన సమాచారం ప్రకారం, లాక్‌డౌన్ సమయంలో 11,29,401 పీఎం కిసాన్ నగదు బదిలీ లావాదేవీలు విఫలమయ్యాయి. నగదు సాయం పొందలేని లబ్దిదారులు 27 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో కేంద్రం పొందుపర్చిన గణాంకాలు, ఇతర సమాచారం పారదర్శకంగా లేదని సామాజిక కార్యకర్త వెంకటేష్ నాయక్ విమర్శించారు.-