Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహారాష్ట్రలో ఆరుగురు మృతి
ముంబై : మహరాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఒక వాహనం 400 అడుగుల లోతైన లోయలో పడిన ఘటనలో ఐదుగురు మహిళలుసహా ఆరుగురు మరణించగా, 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ఎస్‌పి తెలిపారు. తోరన్మల్ హిల్‌స్టేషన్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాడ్కి ఘాట్ ప్రాంతంలో ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. నందుర్బార్ జిల్లా ఖడ్కితో పాటు సమీపంలోని గ్రామాల నుంచి 24 మందితో కూడిన వాహనం అహ్మదాబాద్‌లోని దండుకకు వెళ్తోంది. వీరిలో ఎక్కువ ఉంది కార్మికులే ఉన్నారు. ఘాట్ సెక్షన్‌ను దాటే క్రమంలో వాహనం అదుపు తప్పడంతో వెనుకగా వెళ్లి లోయలో పడింది.