Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : రూ.100, రూ.10, రూ.5 పాత సిరీస్ నోట్లను మార్చి లేదా ఏప్రిల్ నాటికి నిలిపివేయాలని యోచిస్తున్నట్లు ఆర్‌బిఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బి.మహేష్ శుక్రవారం వెల్లడించారు. రూ.100, రూ.10, రూ.5 పాత నోట్ల ముద్రణను ఆపేసినట్లు చెప్పారు. ప్రస్తుతం చెలామణీలో ఉన్న పాత సిరీస్ నోట్లు కూడా మార్చి, ఏప్రిల్‌లో చెలామణిలో లేకుండా చేస్తామని తెలిపారు. రూ.10 నాణేలను ప్రవేశపెట్టి 15 ఏళ్లవుతున్నా వ్యాపారులు, వాణిజ్యదారులు వాటిని విశ్వసించలేకపోతున్నారని, అవి బ్యాంకుల్లో పోగుపడ్డాయని చెప్పారు. అవి ప్రజల్లో చెలామణి అయ్యేలా మార్గాలను అన్వేషించాలని కోరారు.