Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అన్నిదారులు ఢిల్లీ వైపే | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 24,2021

అన్నిదారులు ఢిల్లీ వైపే

- కిసాన్‌ రిపబ్లిక్‌ పరేడ్‌ కు అనుమతి
- నేడు ముంబయిలో భారీ సభ
- ఒడిశా రైతులను అడ్డుకున్న పోలీసులు
- మమ్మల్ని చంపేందుకు కుట్ర: రైతు నేతలు
- 59వ రోజు కొనసాగిన ఆందోళన
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దాదాపు రెండు నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమిస్తు న్నారు. పలు దఫాలుగా రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. అయినా రైతుల డిమాండ్లను కేంద్రం అంగీకరించడం లేదు. చట్టాలను రద్దు చేసేదాకా ఉద్యమం ఆగబోదని రైతు సంఘాలు తెగేసి చెప్పాయి. దీంతో రైతుసంఘాలు ఈనెల 26న ఢిల్లీలో కిసాన్‌పరేడ్‌ నిర్వహించా లని నిర్ణయించాయి. పరేడ్‌లో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రైతులు ఢిల్లీకి పయనమయ్యారు. పరేడ్‌కు మొదట అమిత్‌షా ఆధ్వర్యంలో పనిచేసే ఢిల్లీ పోలీసులు అంగీ కరించలేదు. అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రయత్నిం చారు. అయినా రైతులు వెనక్కితగ్గలేదు. ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు శనివారం కిసాన్‌ పరేడ్‌కు అనుమతిచ్చారు. పోలీసులు మూడు ప్రాంతాలను ప్రతిపాదించగా, రైతు సంఘాల నేతలు ఢిల్లీ అవుటర్‌ రింగ్‌ రోడ్డునే పరేడ్‌ చేపట్టాలని నిర్ణయించారు. రైతు సంఘాలు ఆదివారం సమావేశమై రోడ్డు మ్యాప్‌ను ప్రకటించనున్నాయి. ఇదిలావుండగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం 59వ
రోజుకు చేరుకుంది.
మమ్మల్ని చంపేందుకు కుట్ర: రైతు నేతలు
జనవరి 26న నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్ల పరేడ్‌లో తమలో నలుగురిని చంపేందుకు కుట్ర జరుగుతున్నట్టు రైతు సంఘాల నేతలు తెలిపారు. తద్వారా కవాతును భగం చేసి ఆందోళనను అణదొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. ఇందుకోసం రంగంలోకి దింపిన ఓ వ్యక్తిని తాము పట్టుకున్నట్టు తెలిపారు. ముఖానికి ముసుగు తొడిగిన అతణ్ని మీడియా ముందుకు తీసుకొచ్చారు. పోలీసుల వలే నటించి కవాతులో రైతులపై లాఠీ చార్జి చేయాలని అతనికి ఎవరో ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. మీడియా సమావేశం అనంతరం అతణ్ని హర్యానా పోలీసులకు అప్పగించామని రైతు సంఘం నేత కుల్వంత్‌ సింగ్‌ సంధు తెలిపారు. ఈ కుట్రకు సంబంధించిన సమాచారాన్ని లీక్‌ చేస్తే కుటుంబ సభ్యులను చంపేస్తామని, దీన్ని అమలు చేయాల్సిన వ్యక్తులను బెదిరించినట్టు చెప్పారు. దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. తమకు ఎలాంటి ముసుగు తొడిగిన వ్యక్తి సమాచారం అందలేదని తెలిపారు.
కాల్పులు జరపాలనుకున్నాం : దుండగుడు
రైతులు తాము పట్టుకున్న ముసుగు తొడిగిన వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ...''జనవరి 26న రైతులు నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవాలని నిర్ణయించుకున్నాం. ఒకవేళ వారు ఆగకపోతే.. తొలుత గాల్లోకి కాల్పులు జరపాలనుకున్నాం. తరువాత మా బృందంలోని మరికొంత మంది సభ్యులు వెనక నుంచి కాల్పులు జరుపుతారు. అక్కడ ఉన్న ఢిల్లీ పోలీసులు.. రైతులే కాల్పులు జరుపుతున్నారని భావించి ఎదురు కాల్పులు జరుపుతారు'' అని వివరించారు.
మంత్రుల కమిటీ ప్రతిపాదనకు చట్టబద్ధత ఉందా?: ఏఐకేఎస్‌
మూడు వ్యవసాయ చట్టాల అమలను18 నెలలు పాటు నిలిపివేస్తామని క్యాబినెట్‌ కమిటీ (సీసీ) చేసిన ప్రతిపాదనకు చట్టపరమైన అనుమతి ఉందా? అని అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకేఎస్‌) ప్రశ్నించింది. మంత్రుల కమిటీ ప్రతిపాదనకు సంబంధించి చట్టబద్ధత అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేయాలని ఎఐకేఎస్‌ కోరింది. ''పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని కొనసాగించడానికి, నిలిపివేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం లేదు. ఒక చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంది. అందువల్ల సీసీ ప్రతిపాదన పార్లమెంటు అధికారాల ఉల్లంఘనగానూ, చట్ట వ్యతిరేకంగానూ ఉంది'' అని ఎఐకేఎస్‌ పేర్కొంది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌ అన్ని చట్టపరమైన అంశాలను చర్చించిన తరువాత రూపొందించామని, ఈ డిమాండ్‌ను నీరుగార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలో 15 వేలు మంది రైతులు మార్చ్‌
నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా అఖిల భారత కిసాన్‌ సభ (ఎఐకేఎస్‌) మహారాష్ట్ర యూనిట్‌ శనివారం నాసిక్‌ నుంచి ముంబాయి వరకు 15 వేల మంది రైతులు రాష్ట్ర వ్యాప్తంగా వాహన మార్చ్‌ ప్రారంభించింది. నాసిక్‌లోని గోల్ఫ్‌ క్లబ్‌ మైదాన్‌ నుంచి వందలాది టెంపోలు, పిక్‌ అప్‌లు, ఇతర వాహనాల్లో మార్చ్‌ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 11 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఎఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, సంయుక్త కిసాన్‌ మోర్చా నేత, మాజీ ఎంపీ హన్నన్‌ మొల్లా, మహా వికాస్‌ అగాడిలోని మూడు పార్టీల అగ్ర నాయకులు, ఎన్‌పీసీ జాతీయ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మంత్రి బాలా సాహెబ్‌ తోరట్‌, శివసేన నేత, మంత్రి ఆదిత్య ఠాక్రే, వామపక్ష, ప్రజాస్వామ్య పార్టీల నాయకులు ప్రసంగించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలో ఎఐకేఎస్‌, సీఐటియూ ఆధ్వర్యాన భారీ కవాతు నిర్వహించారు.
ఒడిశా రైతులను అడ్డుకున్న పోలీసులు
ఒడిశాకు చెందిన సుమారు 500 మంది రైతులను ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీరిలో 70 మంది మహిళా రైతులు కూడా ఉన్నారు. సికంద్రా సమీపంలోని గురు కా తాల్‌ వద్ద ఆగ్రా - ఢిల్లీ జాతీయ రహదారిపై రైతులను నిలిపివేశారు. ఈ 26న పలువురు రైతులు ఢిల్లీలో చేపట్టనున్న ట్రాక్టర్‌ పరేడ్‌కు మద్దతు తెలిపేందుకు వీరు ఢిల్లీకి బయలుదేరారు. భారతీయ కిసాన్‌ యూనియన్‌ బ్యానర్‌ కింద ఇటీవల జరిగిన ట్రాక్టర్‌ ర్యాలీలో కూడా వీరు పాల్గొన్నారు. పశ్చిమబెంగాల్‌, జార్ఖండ్‌, బీహార్‌ మీదుగా ప్రయాణిస్తూ.. అన్ని అడ్డంకులను దాటుకుని సుమారు 1800 కిలోమీటర్లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం యూపీలోని చందౌలి సరిహద్దుకు చేరుకున్నారు. గత మూడు రోజులుగా వారు ఢిల్లీ చేరుకునేందుకు యత్నిస్తూనే ఉన్నారు. తమపై పోలీసులు, అధికారులు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, ట్రాక్టర్‌ పరేడ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారని అన్నారు. అయినప్పటికీ.. ఢిల్లీ పరేడ్‌లో పాల్గొని తీరతామని, భవిష్యత్‌ తరాల కోసం చేస్తున్న ఈ చారిత్రాత్మక పోరాటంలో తాము భాగస్వాములమవుతామని ఎన్‌కేఎస్‌ జాతీయ కన్వీనర్‌ అక్షయకుమార్‌ తెలిపారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఐటీ దాడులతో అణచలేరు
జీడీపీ సరే జాబ్‌ ఏదీ..?
ప్రభుత్వ శాఖలు మూత
మళ్లీ కట్టెలపొయ్యే!
బడికి దూరమైండ్రు
మధ్యప్రదేశ్‌లో భారీగా పెరిగిన నిరుద్యోగం
యూపీలో మరో మైనర్‌ ప్రాణాలు బలి
బాలీవుడ్‌ దర్శక, నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌, నటి తాప్సీ ఇండ్లపై ఐటీ దాడులు
గ్రామాల్లో నిరాహార దీక్షలు
సజావుగా వరిధాన్యాల సేకరణ
భారత అగ్రశ్రేణి బ్యాంకులపై రూ. 6.19 లక్షల కోట్ల భారం
అనుమానాలు వంద ఉన్నా.. అవి సాక్ష్యంగా నిలబడవు..
సర్కారును సవాలు చేస్తే...
భారీగా పెరిగిన ఇండియా ఇంధన అవసరాలు
వేతన కోతలు..
మరింత ఉధృతంగా..
కొత్తగా 40 మంది కుబేరులు
ఆకాశంలో సగం వట్టిదే!
బీజేపీ మంత్రి రాసలీలలు
సహజీవనంలో శృంగారం.. లైంగికదాడా..?
చెరుకు సమస్యలపై యూపీ రైతుల నిరసనలు
పెట్రో ధరలకు నిరసనగా కేరళలో రవాణా సమ్మె
యూపీలో ఆటవిక రాజ్యం
బీజేపీని ఓడించండి
పోర్టుల్లోకి ప్రయివేటు పెట్టుబడులు : మోడీ
మోడీపై ప్రశంసలకు నిరసనగా
141 మంది రైతుల బలవన్మరణం
కేరళ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడిగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌ తరహ సేవలు
బీజేపీ ఎస్సీ మోర్చా నేషనల్‌ సెక్రటరీగా పెద్దపల్లికి చెందిన ఎస్‌ కుమార్‌ నియామకం

తాజా వార్తలు

09:02 AM

కుమార్తె తలతో నడి వీధుల్లో తండ్రి వీరంగం

08:49 AM

నేటి నుంచి 12 వరకు తిరుపతి మీదుగా వెళ్లే రైళ్లు రద్దు!

08:25 AM

టీడీపీ నేత కుమారుడు ఆత్మహత్యాయత్నం

07:49 AM

తక్షణం మోడీ ఫోటలను తొలగించండి

07:31 AM

అరుదైన ఘనతను సాధించిన తెలంగాణ

07:06 AM

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్

10:49 PM

రాజకీయాల నుంచి తప్పుకున్న శశికళ.. సంచలన ప్రకటన

09:06 PM

కట్టుకథ అల్లిన డిగ్రీ విద్యార్ధిని

08:45 PM

ఆగస్టులో తెలంగాణ ఐసెట్‌

07:41 PM

పోలీస్ వర్గాల్లో సంచలనం

07:29 PM

ఏపీ సీఎం ఢిల్లీ పర్యటన వాయిదా

07:20 PM

న్యాయవాద దంపతులు హత్య సీన్ రీ కన్‌స్ట్రక్షన్

06:52 PM

మహిళను నాటు తుపాకీతో కాల్చి చంపిన ప్రత్యర్థులు

06:36 PM

ఏసీబీ వలలో పాఠశాల విద్యా సహాయ సంచాలకుడు

06:24 PM

మార్చి 7న జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందజేత : అల్లం నారాయణ

05:11 PM

స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట

04:49 PM

ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..

04:46 PM

కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం

03:17 PM

వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం

03:05 PM

ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు

02:17 PM

పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం

01:53 PM

ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య

01:36 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు

01:17 PM

తిరుపతిలో బాలుడు కిడ్నాప్..సీసీటీవీ కెమెరాల్లో దృశ్యాలు

01:03 PM

పెండ్లి అయిన కొన్ని గంట‌ల‌కే విషాదం..

12:17 PM

భార్య, ముగ్గురు కూతుళ్లను గొడ్డలితో నరికాడు..

11:58 AM

శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత

11:36 AM

ఖమ్మం జిల్లాలో దారుణం..

11:16 AM

బయటపడిన 14 కోట్ల సంవత్సరాల నాటి టిటానోసారస్ అవశేషాలు

10:57 AM

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.