Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
నేడు కిసాన్‌ పరేడ్‌ | జాతీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • జాతీయం
  • ➲
  • స్టోరి
  • Jan 26,2021

నేడు కిసాన్‌ పరేడ్‌

- విజయవంతానికి మార్గదర్శకాలు.. స్పష్టమైన ప్రణాళికతో ముందుకు
- హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7428384230 కేటాయింపు
- ఢిల్లీలో ఆరు రూట్లల్లో పరేడ్‌
- ట్రాక్టర్‌లపై రైతు జెండాలతో పాటు జాతీయ జెండాలు
- రాజధాని సరిహద్దుల్లో భారీగా ట్రాక్టర్‌లు
- రాష్ట్రాల నుంచి తరలొచ్చిన అన్నదాతలు
- చరిత్రను సృష్టించబోతున్నాం : రైతు సంఘాల నేతలు
- కోట్లాది మంది హృదయాలను గెలవడమే ముఖ్యం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా ఆందోళన చేస్తున్న అన్నదాతలు మరో చరిత్రను సష్టించబోతున్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రైతులు లక్షలాది ట్రాక్టర్లతో '' కిసాన్‌ రిపబ్లిక్‌ పరేడ్‌'' నిర్వహించబోతున్నారు.
ఈ పరేడ్‌కు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రైతులు హాజరవుతున్నారు. ఇప్పటికే రైతులతో దేశ రాజదాని సరిహద్దులు నిండిపోయాయి. అన్నదాతలు చేపట్టే కిసాన్‌ పరేడ్‌ లో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ నుంచి ఢిల్లీ వచ్చారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన మంజీందర్‌ సింగ్‌, తన సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ నుంచి రైతులను ఏకం చేశారు. ముఖ్యంగా గ్వాలియర్‌, అశోక్‌ నగర్‌, మోరేనా, శిప్‌పురి నుంచి దాదాపు పదివేల ట్రాక్టర్లతో ఢిల్లీ చేరారు. కేవలం ఢిల్లీ సమీప రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రైతులు ట్రాక్టర్‌ ర్యాలీలు చేపడుతారని, వీటి సంఖ్య లక్షల్లో ఉండనుందని రైతు సంఘం నేత ధర్మేంద్ర మాలిక్‌ వెల్లడించారు.
కేవలం ముందస్తుగా రిజిస్టర్‌ చేసుకున్న రైతులు మాత్రమే ఈ ట్రాక్టర్‌ ర్యాలీలో పాల్గొంటారని ఆయన తెలిపారు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గణతంత్ర దినోత్సవం రోజున ప్రజలు ట్రాక్టర్స్‌ పరేడ్‌లో రైతులు పాల్గొనబోతున్నారని కిసాన్‌ మోర్చా నేతలు తెలిపారు. ఈ పరేడ్‌ ద్వారా వ్యవసాయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లను దేశానికి, ప్రపంచానికి చెప్పేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా పరేడ్‌ నిర్వహిస్తూ తమ లక్ష్యం ఢిల్లీని జయించడం మాత్రమే కాదని, కోట్లాది మంది ప్రజల హృదయాలను గెలవడమని అన్నారు.
ఆరు రూట్లల్లో పరేడ్‌ 300 కిలో మీటర్ల మేర ర్యాలీ
కిసాన్‌ రిపబ్లిక్‌ పరేడ్‌ కు ఆరు సరిహద్దు ప్రాంతాల నుంచి రూట్లు నిర్ణయించారు. అందులో మూడు పెద్దవి, మూడు చిన్నవి ఉన్నాయి. రైతులు ఆందోళన చేస్తోన్న ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీ, ఘాజీపూర్‌ నుంచి ట్రాక్టర్‌ పరేడ్‌ బయలుదేరనుంది. ఈ మూడు సరిహద్దు మార్గాల్లో దాదాపు 300 కిలోమీటర్ల మేర ట్రాక్టర్‌ పరేడ్‌ కొనసాగనున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం నిర్వహించే గణతంత్ర వేడుకల అనంతరం దాదాపు 11గంటలకు రైతుల చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ ప్రారంభంకానుంది.
సింఘు బోర్డర్‌ నుంచి కహర్‌ హొడా టోల్‌ ప్లాజా వరకు మొత్తం 63 కిలోమీటర్ల ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. సింఘు సరిహద్దు వద్ద ప్రారంభమైన ట్రాక్టర్స్‌ పరేడ్‌ ఎస్జిటీ నగర్‌, డీటీయూ షాహాబాద్‌, ఎస్బి డైరీ, భర్వాలా, పూత్‌ ఖుహర్డ్‌, భావన టీ పాయింట్‌, కుంఝావాలా చౌక్‌, కుతబ్‌ గఢ్‌, అచ్చందీ బోర్డర్‌ మీదు సాగి కహర్‌ హొడా టోల్‌ ప్లాజా వద్ద ముగుస్తుంది.
టిక్రి నుంచి అసోడా టోల్‌ ప్లాజా వరకు మొత్తం 62.5 కిలో మీటర్లు ట్రాక్టర్‌ పరేడ్‌ నిర్వహించనున్నారు. టిక్రీ సరిహద్దు వద్ద ప్రారంభమైన కిసాన్‌ పరేడ్‌ నంగ్లోయి, బాప్రోలా విలేజ్‌, నజఫ్‌ ఘడ్‌, ఝారోడా బోర్డర్‌, రోతక్‌ బైపాస్‌ మీదుగా సాగి అసోడా టోల్‌ ప్లాజా వద్ద ముగుస్తుంది.
ఘాజీపూర్‌ నుంచి ఘాజీపూర్‌ సరిహద్దు వరకు 68 కిలోమీటర్ల మేర ట్రాక్టర్‌ ర్యాలీ జరగనుంది. ఘాజీపూర్‌ వద్ద ప్రారంభమైన కిసాన్‌ పరేడ్‌ అప్సర బోర్డర్‌, హాపూర్‌ రోడ్డు, ఐఎంఎస్‌ కాలేజ్‌, లాల్‌కున్‌ మీదుగా సాగిన ట్రాక్టర్స్‌ మార్చ్‌ తిరిగి ఘాజీపూర్‌ వద్దకు చేరుకుంది.
షాజహాన్‌పూర్‌ సరిహద్దులో ప్రారంభమైన కిసాన్‌ పరేడ్‌ బావల్‌, మనేసర్‌ మీదుగా సాగి మళ్ళీ షాజహాన్‌పూర్‌కు చేరుకుంటుంది. మేహావాట్‌ రూట్‌ లో సున్హేడా జూర్హేడా బోర్డర్‌ లో ప్రారంభమైన పునహానా, పిన్గ్వాన్‌, బాడకలి, నూహా, బిడపూర్‌ చౌక్‌, ఉటవాడ మూడ్‌, కోట్‌ మీదుగా సాగి మళ్ళీ పునహానాకు చేరుకుంటుంది. చిల్లా బోర్డర్‌ రూట్‌ లో చిల్లా బోర్డర్‌ లో ప్రారంభమై క్రిలోవన్‌ ప్లాజా రెడ్‌ లైట్‌, డిఎన్‌ డి ప్లైవే, మెయిన్‌ దాద్రీ రోడ్డు, దాద్రీ రోడ్డు మీదుగా పరేడ్‌ సాగి చిల్లా బోర్డర్‌ లో ముగుస్తుంది.
పరేడ్‌కు సూచనలు
పరేడ్‌పై గందరగోళం పడొద్దని, సమాచారాన్ని వీలైనంత ఎక్కువ మందితో పంచుకోవాలని రైతు సంఘాల నేతలు సూచించారు. ఏదైనా గందరగోళం ఉంటే ఆయా రైతు సంఘాల నాయకులను సంప్రదించాలని, హెల్ప్‌లైన్‌ నంబర్‌ 7428384230 కు కాల్‌ చేయాలని సూచించారు.
1. పరేడ్‌ లో ట్రాలీలు అనుమతించబడవు. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు మాత్రమే అనుమతించబడతాయి. ప్రత్యేక పట్టిక ఉన్న ట్రాలీలకు మినహాయింపు ఉంటుంది.
2. 24 గంటలకు సరిపడా రేషన్‌, నీరు ప్యాక్‌ చేసుకోవాలి. చలి నుంచి రక్షణ కోసం మీకు సరైన ఏర్పాట్లు చేసుకోవాలి.
3. ప్రతి ట్రాక్టర్‌ రైతు సంఘాల జెండాలతో పాటు జాతీయ జెండాను అమర్చాలి. ఏ రాజకీయ పార్టీ జెండా ఉండదు.. ఎవరు ఎలాంటి ఆయుధాన్ని తీసుకెళ్లవద్దు. కర్రలు కూడా వేయకండి. రెచ్చగొట్టే, ప్రతికూల నినాదాలతో బ్యానర్‌లను ఉపయోగించవద్దు.
5. మీరు కవాతులో పాల్గొన్నట్ల్టుతెలియ జేయాలనుకుంటే 8448385556 కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వండి.
6. పరేడ్‌ను రైతు నాయకుల ఉండే కార్లతో నడిపిస్తారు. ఏ కారు, ట్రాక్టర్‌ ఆ కారును అధిగమించకూడదు. దయచేసి ఆకుపచ్చ జాకెట్లు ధరించిన వాలంటీర్ల సూచనలను అనుసరించాలి
7. పరేడ్‌ కోసం మార్గం ముందుగా నిర్ణయించబడింది. పోలీసులు, ట్రాఫిక్‌ వాలంటీర్ల మార్గనిర్దేశాన్ని పాటించాలి.
8 ఏదైనా కారు, ట్రాక్టర్‌ ఏ కారణం లేకుండా ఒక ప్రాంతాన్ని ఆగిపోతే ఆ కారు, ట్రాక్టర్‌ వాలంటీర్లచే తొలగించబడుతుంది. పరేడ్‌లోని అన్ని కార్లు, ట్రాక్టర్లు పరేడ్‌ పూర్తయిన తరువాత ప్రారంభ స్థానానికి తిరిగి చేరుకుంటాయి..
9. డ్రైవర్‌ సహా గరిష్టంగా 5 మంది ఒక ట్రాక్టర్‌లో ప్రయాణించవచ్చు. ట్రాక్టర్ల బోనెట్‌, బంపర్‌, పైకప్పుపై ఎవరూ ప్రయాణించరు. మిగిలిన వారు ఆందోళన ప్రాంతాల్లోనే ఉండాలి.
10. అన్ని ట్రాక్టర్లు తప్పనిసరిగా ఒక లైన్‌లో కొనసాగాలి, కవాతుకు నాయకత్వం వహిస్తున్న రైతు నాయకుల వాహనాలను దయచేసి అధిగమించవద్దు.
11. దయచేసి ట్రాక్టర్‌లో పాటలు వేయవద్దు. పరేడ్‌లో ప్రతిఒక్కరూ ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని ప్రకటనలు వినిపించాలి.
12. పరేడ్‌ కు ముందు, పరేడ్‌ సమయంలో బాణాసంచా వాడటం నిషేధం. మాదక ద్రవ్యాలను కలిగి ఉన్న, తినేవారిని అడ్డుకోవడం జరుగుతుంది.
13. పరేడ్‌ను మనోహరంగా నిర్వహించడం. తోటి పౌరుల హదయాలను గెలుచుకోవడమే ఉద్దేశం. పోలీసులు ఎలాంటి గొడవలకు పాల్పడకూడదు. అన్ని వార్తా ఛానెళ్ల ప్రతినిధులను గౌరవించాలి.
14. చెత్తను రోడ్లపైకి విసిరి పరిసరాలను కలుషితం చేయవద్దు. వ్యర్థాలను పారవేసేందుకు ఒక సంచిని తీసుకెళ్లాలి.
అత్యవసర పరిస్థితులకు మార్గదర్శకాలు
కిసాన్‌ ఏక్తా మోర్చా ఏరకమైన అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు నిబంధనలు విధించింది.
1. పుకార్లను విస్మరించండి. ఏదైనా తనిఖీ చేయాలనుకుంటే, ఏదైనా ధ్రువీకరించాలనుకుంటే, వాస్తవాన్ని తెలుసుకోవడానికి కిసాన్‌ ఏక్తా మోర్చా ఫేస్‌బుక్‌ పేజీలో చూడాలి
2. పరేడ్‌లో అంబులెన్సులు సమీపంలో ఉంటాయి. ఆస్పత్రుల్లో ఏర్పాట్లు చేశారు. మెడికల్‌ ఎమర్జెన్సీ ఉంటే, హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలి. సమీప వాలంటీర్‌ను సంప్రదించాలి.
3. ట్రాక్టర్‌, కారుతో ఏదైనా సమస్య ఉంటే, దాన్ని ప్రక్కన ఉంచి, వాలంటీర్‌ను సంప్రదించండి. లేకపోతే హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయండి.
4. ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగితే, దానిని 112 నంబర్‌ వద్ద ఉన్న పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు నివేదించాలి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

చారిత్రాత్మకం...
చలో ఢిల్లీ...
అది భారత్‌ అంతర్గత విషయమే..కానీ !
మహా ఆర్థిక కష్టాలు
అంతా అబద్ధం...
లింగ అసమానతల భారం
చట్టమే విమర్శించే హక్కు ఇచ్చింది!
ఐటీ కొత్త నిబంధనలను నిలిపేయండి
డెస్క్‌టాప్‌ పైనా వాట్సాప్‌ కాల్స్‌
భావితరాల కోసం పోరాడాలి
మాపై వ్యతిరేక వార్తలు రానివ్వొద్దు!
బీజేపీకి 20 స్థానాలు
బీజేపీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల్లో ఘర్షణ : ఇద్దరు మృతి
ఎన్‌డిఎ, ఎన్‌ఎఇ ఫలితాలు విడుదల
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్‌కు కష్టాలు
తుఝే సలాం..
ఏపీ బంద్‌ సంపూర్ణం
రైల్వే ప్లాట్‌ ఫాం టికెట్‌ ఇక నుంచి రూ.30
మీడియాపై సెన్సార్‌
రాజకీయ సాధనంగా దర్యాప్తు సంస్థలు
తిండి చెత్తబుట్టల పాలు
అన్నదాతకు అండగా...
సీజేఐకు రాసిన లేఖకు కట్టుబడి ఉన్నా!
మహౌన్నత రైతన్న ఉద్యమం
పడిపోయిన కుటుంబాల ఆదాయం
291 మందితో టీఎంసీ తొలి లిస్టు విడుదల చేసిన మమత
9 మందికి మరణ శిక్ష
అన్ని వర్గాలతోనే తెలంగాణలో కాంగ్రెస్‌ కు మనుగడ
పైసల్లేవ్‌..
భారత్‌లో స్వేచ్ఛ తగ్గింది..

తాజా వార్తలు

08:02 PM

‘జాతిరత్నాలు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్

07:52 PM

కర్ణాటక మాజీ మంత్రి సెక్స్ కుంభకోణం కేసులో మరో ట్విస్ట్

07:35 PM

అది నిరూపించకపోతే కేసీఆర్ కు బడితెపూజ చేస్తా : బండీ సంజయ్

07:28 PM

జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మంత్రి కేటీఆర్‌ హామీ..

07:24 PM

భారీ అగ్నిప్రమాదం..20 కూలీల గృహాలు దగ్ధం

07:12 PM

చెరువులో పడి జాలరి మృతి

07:04 PM

నల్లమలలో అగ్నిప్రమాదం..

07:02 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు మృతి

06:20 PM

వాటిని చూసి, పిచ్చెక్కిపోయి ఈ వీడియో చేస్తున్నాను : అషూ రెడ్డి

06:10 PM

ఏపీలో 136 కరోనా కేసులు నమోదు

05:40 PM

కబడ్డీ ఆడిన రోజా.. వీడియో వైరల్

05:25 PM

నాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు..? సారంగదరియా పాటపై వివాదం

05:10 PM

గ్యాస్ సిలిండ‌ర్‌తో మ‌మ‌తా బెన‌ర్జీ భారీ ర్యాలీ

04:51 PM

రేపు మహిళా ఉద్యోగులకు సెలవు : సీఎం కేసీఆర్‌

04:40 PM

ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ వీడియో

04:29 PM

బండి సంజయ్ కు మంత్రి కేటీఆర్ కౌంటర్

04:17 PM

రేపటి నుండి పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు

04:09 PM

సిద్దిపేట జిల్లాలో ఆర్‌ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు కలకలం

03:59 PM

ఎన్నికలప్పుడు కుస్తీ.. తర్వాత దోస్తీ.. కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ

03:44 PM

పెళ్లి తేదీ కూడా మీరే చెప్పేయండి.. రెండో పెళ్లిపై మంచు మనోజ్‌

03:35 PM

నాగబాబు కూతురు నిహారిక కాలికి గాయం..

03:14 PM

మీరు భయపెడితే భయపడిపోతామనుకుంటే పొరపాటే : కేరళ సీఎం

02:56 PM

తెలంగాణ హోంమంత్రి మనవడిపై ర్యాగింగ్‌ కేసు

02:29 PM

ఐపీఎల్ 2021 షెడ్యూల్..

02:01 PM

ఐటీ సోదాల్లో బ‌య‌ట‌ప‌డిన‌ వెయ్యి కోట్ల అక్ర‌మాస్తులు‌

01:42 PM

రాష్ట్ర ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ‌

01:28 PM

వైసీపీ, టీడీపీలతో పొత్తు లేదు: సీపీఐ(ఎం) మధు

01:20 PM

సోనియా అధ్య‌క్ష‌త‌న‌ కాంగ్రెస్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌మావేశం‌

01:08 PM

టెయిలెండర్ల ఆటతీరుపై సుందర్ తండ్రి షాకింగ్ కామెంట్స్

12:32 PM

మిగిలిన కొడుకు శరీర భాగాలను మూట కట్టుకొని..!

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.