Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా మంగళవారం 72వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జమ్ముకాశ్మీర్ శీతాకాల రాజధాని జమ్ములో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షత వహించారు. భద్రతా దళాలు సమర్థవంతంగా హింసను నియంత్రించాయని తెలిపారు. శ్రీనగర్ షర్-ఇ-కాశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జరిగినకార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ సలహాదారు బసీర్ అహ్మద్ ఖాన్ అధ్యక్షత వహించారు.
మణిపూర్‌లో ప్రశాంతంగా..
అనేక సాయుధ సంస్థలు బహిష్కరణకు పిలుపునిచ్చినా మణిపూర్‌లో వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఇంపాల్‌లోని కంగ్లా వద్ద గవర్నర్ నజ్మా హెప్తుల్లా జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా దళాల నుంచి వందనం స్వీకరించారు. కోవిడ్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే భద్రతా దళాలను అనుమతించామని ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ తెలిపారు.
లాక్‌డౌన్‌లో అందరికీ ఆహారం : కేరళ గవర్నర్
కరోనా లాక్‌డౌన్‌లో కేరళ ప్రభుత్వం అందరికీ ఆహారాన్ని అందించిందని రాష్ట్ర గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం వద్ద గణతంత్ర దిన వేడుకల్లో గవర్నర్ పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి వందనం స్వీకారం చేశారు. లాక్‌డౌన్ సమయంలో అందరికీ ఆహారం అందించడానికి సంక్షేమ, సంరక్షణ విధానాన్ని ప్రభుత్వం అనుసరించిందని తెలిపారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ పోరాటానికి ప్రపంచ సంస్థల ప్రశంసలు లభించాయని చెప్పారు.