Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ తీర్పును సవాల్ చేస్తాం : బాలల హక్కుల సంఘాలు
- లైంగికదాడి కేసులో నాగపూర్ ధర్మాసనం తీర్పుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం
న్యూఢిల్లీ : 'శారీరక కలయిక' (స్కిన్ టు స్కిన్) జరగన ప్పుడు దానిని లైంగికదాడికి భావించలేమని ఒక కేసులో బాంబే హైకోర్టు (నాగపూర్ ధర్మాసనం) ఇచ్చిన తీర్పును బాలల హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇది అత్యంత దారుణమైన తీర్పుగా సామాజిక, బాలల హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ (ఎన్‌సీ పీసీఆర్) కోరింది. ఈ అంశంపై వెంటనే స్పందించాలని మహారాష్ట్ర ముఖ్య కార్యదర్శికి ఎన్‌సీపీసీఆర్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కానూగో లేఖ రాశారు. '' శారీరక కలయిక, లైంగిక చర్య లేనప్పుడు అది పోక్సో చట్టం కింద నేరం కాదు..''అని నాగపూర్ ధర్మాసనం తీర్పు చెప్పటాన్ని ప్రియాంక్ కానూగో తీవ్రంగా తప్పుబట్టారు. తీర్పును సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మైనర్ బాలికపై లైంగికదాడి జరిగిన ఒక కేసులో నిందితుడు దోషిగా తేలాడు. దీనిపై నిందితుడు తరఫువారు బాంబే హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లగా, నాగపూర్ ధర్మాసనం కేసును విచారించింది. పోక్సో చట్టంలో పేర్కొన్నవిధంగా శారీరక కలయిక (స్కిన్ టు స్కిన్) , లైంగిక చర్య లేనందున.. నింది తుడు లైంగికదాడి జరపాడని భావించలేమని నాగపూర్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనిపై సామాజిక, బాలల హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్లను ధర్మాసనం అన్వయించిన తీరు దారుణమని బాలల హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ తీర్పుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లాలని డిమాండ్ చేశాయి.