Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా డిజిటల్ కరెన్సీపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కరెన్సీ నాణేలు, నోట్లకు డిజిటల్ రూపం ఇస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని కేంద్ర బ్యాంకు పరిశీలిస్తోందని భారత్‌లో చెల్లింపుల వ్యవస్థ పేరిట ప్రచురించిన ఓ అధ్యయనం వెల్లడయ్యింది. ప్రస్తుతమున్న ఫియట్ కరెన్సీని పోలిన డిజిటల్ కరెన్సీ అవసరం దేశంలో ఉందా..? ఇవి అవసరమే అనుకున్న పక్షంలో వీటిని ఎలా చెలామణీలోకి తేవాలి అనే అంశాన్ని పరిశీలిస్తోన్నట్టు ఆర్బీఐ తెలిపింది.