Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఐదో రియల్ ఎస్టేట్ ఫండ్ ఇండియా రియాల్టీ ఎక్సలెన్సీ ఫండ్ వి (ఐఆర్‌ఇఎఫ్ వి) ద్వారా రూ.800 కోట్ల నిధులు సమీకరించాలని యోచిస్తోన్నట్లు మోతిలాల్ ఓస్వాల్ రియల్ ఎస్టేట్ (మోర్) తెలిపింది. మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్సీయల్ సర్వీసెస్‌కు చెందిన ఈ సంస్థ ఇంతక్రితం నాలుగు సార్లు సమీకరించిన నిధులను ప్రధానంగా పిఎంఎస్, ఎన్‌సిడిల్లో పెట్టుబడులుగా పెట్టినట్లు తెలిపింది. ఇది వరకు మూడు సార్లు సమీకరించిన నిధులను ప్రారంభ దశ పెట్టుబ డులపై వెచ్చించగా.. ఐదో దశ ఫండ్స్‌ను ప్రధానంగా అనుమతి పొందిన ప్రాజెక్టులలో నిర్మాణ ఫైనాన్స్ చేయాలని భావిస్తోన్నట్లు పేర్కొంది.