Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్ల వ్యవధిలో.. మన్మోహన్, మోడీ ఏంచేశారు..?
- ఆర్టీఐలో వెలుగుచూసిన వాస్తవాలు
తిమ్మిని బమ్మిని చేయటానికి మోడీ సర్కారు నానా తంటాలుపడున్నది. లేని దాన్ని ఉన్నట్టు.. ఉన్న దాన్ని లేనట్టు చూపించి... అదంతా తమ ఘనతేనని చెప్పటానికి కేంద్ర ప్రభుత్వం కిందామీదాపడుతున్నది. మోడీ మొదలుకొని, సహచర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జైట్లీతో పాటు క్యాబినెట్ సహచరులంతా ఒకటే మాట చెబుతున్నారు. ఎన్డీఏ సర్కారు నోట్ల రద్దు నిర్ణయంతో ఉగ్రవాదం తగ్గిందని, కాశ్మీర్ ప్రశాంతంగా ఉన్నదని చెబుతున్నారు. వారు చెప్పే మాటల్లో నిజమెంత..? ఇంతకీ యూపీఏ, ఎన్డీయే సర్కారులు కాశ్మీర్‌లో ముష్కర మూకలను ఏవిధంగా ఏరివేశాయి...? మన్మోహన్ చివరి మూడేండ్ల వ్యవధిలో (2011 మే నుంచి 2014 మే వరకు), మోడీ సర్కార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత (2014 మే నుంచి 2017 వరకు) మూడేండ్లలో ఖర్చుపెట్టిందెంత? ఆర్టీఐలో బయటికొచ్చిన కఠోరవాస్తవాలపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ-జనరల్ డెస్క్ న్యూఢిల్లీ : మంచి ఆహ్లాదకరమైన వాతావరణంతో పర్యాటకులను ఆకర్షించే జమ్మూకాశ్మీర్ అగ్ని గుండంలా ఎందుకు మండుతోంది? గత 15 నెలల్లో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాల వల్లే ఉగ్రవాదం బుసలు కొడుతుందని రా మాజీ చీఫ్ దులత్ చెప్పాక కూడా.. అంతా భద్రత దళాలు చూసుకుంటున్నాయని కేంద్ర హౌంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉగ్రవాదం తగ్గిందని ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ జనం దృష్టి మళ్లించేలా ప్రకటనలు, ప్రచారం చేస్తూ నే ఉన్నారు. ఇప్పటికీ చల్లటి కాశ్మీరంలో రక్తపుచారలు పారేలా చేస్తున్నది ఎవరన్న దానిపై చర్చకు తెరలేసింది. ఈ విషయాలన్నీ ఆర్టీఐ కింద బహిర్గతమయ్యాక.. మోడీ సర్కా రు రక్తపుసెలయేర్లను ఎలా పారిస్తున్నదో వెలుగుచూశాయి.
చనిపోయిన జవాన్లే అధికం..
కేంద్రహోం మంత్రిత్వశాఖ వివరాల ప్రకారం.. మన్మో హన్, మోడీసర్కార్లు ఉగ్రవాదానికి జరిపిన వ్యతిరేక పోరులో 288మంది జవాన్లు తమప్రాణాలు కోల్పోయ్యారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రంజన్‌తోమర్ కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి మన్మోహన్, మోడీ పాలనలో కాశ్మీర్‌లో ఎరులై పారుతున్న రక్తపాతం గురించిన వివరాలు రాబట్టారు. ఇదిలా ఉంటే రోజూఐదారుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు మట్టుబెడుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి చెబుతున్నారు. వారి పోరాట పటిమను ప్రశంసి స్తున్నానని కొనియాడారు. అంతా సవ్యంగా ఉన్నదని సంకే తాలిస్తూ... వాస్తవాలను మరుగునపర్చేలా మోడీ మీడియా శ్రమిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు మూడేండ్ల కాలంలో
యూపీఏ ఎన్డీఏ
దాడులు 705 812
మృతిచెందిన పౌరులు 59 62
మృతిచెందిన జవాన్లు 105 183
ఉగ్రనిర్మూలనకు రూ.850కోట్లు రూ.1,890 కోట్లు
వెచ్చించిన నిధులు..