Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31మంది ముఖ్యమంత్రుల్లో.. 25మంది కోటీశ్వరులు
- 11మంది సీఎంలపై క్రిమినల్ కేసులు
- రూ.177 కోట్లతో చంద్రబాబు మొదటి స్థానం
- కేసీఆర్ ఆస్తులు రూ.15 కోట్ల 15 లక్షలు
- 22 క్రిమినల్ కేసులతో దేవేంద్ర ఫడ్నవీస్(బీజేపీ) రికార్డు: ఏడీఆర్,నేషనల్ ఎలక్షన్ వాచ్ రిపోర్టు
న్యూఢిల్లీ: దేశంలోని ముఖ్యమంత్రుల్లో 25మంది కోటీశ్వరులు కాగా, 11మందిపై క్రిమినల్ కేసులున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలెక్షన్‌వాచ్ తమ తాజా నివేదికలో వెల్లడించాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల 31మంది ముఖ్యమంత్రుల్లో 11మంది(35 శాతం)పై క్రిమినల్ కేసులున్నట్టు వారు స్వయంగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లలో తెలిపారని నివేదిక స్పష్టం చేసింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు చూపినవారిలో ఇద్దరు, 10 నుంచి 50 కోట్ల మధ్య ఆరుగురు, 1 నుంచి 10 కోట్ల మధ్య 17మంది, కోటికన్నా తక్కువ చూపినవారిలో ఆరుగురు ముఖ్యమంత్రులున్నారు.
సంపదలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమాఖండూ(బీజేపీ) రూ.129 కోట్లతో రెండో స్థానంలో, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్‌సింగ్ (కాంగ్రెస్) రూ.48 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రులందరిలోకి అతి తక్కువ ఆస్తుల(రూ.26 లక్షలు)తో త్రిపుర సీఎం మాణిక్‌సర్కార్(సీపీఐ(ఎం)) రికార్డు సృష్టించారు. తక్కువ ఆస్తుల్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (టీఎంసీ) రూ.30 లక్షలతో, జమ్మూకాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ(పీడీపీ) రూ.50 లక్షలతో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఆస్తుల్ని రూ.15కోట్ల 15 లక్షల 82 వేలుగా ఎన్నికల కమిషన్‌కు చూపారు. క్రిమినల్ కేసుల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(బీజేపీ) 22 కేసులతో మొదటిస్థానంలో ఉన్నారు. వాటిలో మూడు సీరియస్ కేసులు. 31మంది ముఖ్యమంత్రుల్లో ముగ్గురు మాత్రమే మహి ళలు. వయసురీత్యా అందరికన్నా పిన్న వయసు సీఎంగా 35 ఏండ్ల పెమా ఖండూ(అరుణాచల్‌ప్రదేశ్), పెద్ద వయస్కుడిగా 74 ఏండ్ల అమరీందర్‌సింగ్(పంజాబ్ సీఎం) రికార్డయ్యారు.