Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం,యూపీ అలసత్వంపై సుప్రీం ఆగ్రహం
- నాలుగు నెలల్లో నివేదికిస్తాం:కేంద్రం
న్యూఢిల్లీ : తాజ్‌మహల్ పరిరక్షణపై అలసత్వం వీడాలని కేంద్రం, ఉత్తరప్రదేశ్ అధికారులకు సుప్రీం కోర్టు బుధవారం స్పష్టం చేసింది. చారి త్రాత్మక నిర్మాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని పేర్కొంది. దీనిపై కోర్టు ఘాటుగా స్పందించింది. 'తాజ్‌ను పునరుద్ధరించండి, లేదా కూల్చండి, లేకుంటే మేమే మూసివేస్తాం' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజ్‌ను సంరక్షించడానికి తగిన చర్యలు చేపట్టని యూపీ ప్రభుత్వ వైఫల్యంపై సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది.ఈ స్మారకాన్ని కాపాడటానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని, అలానే రక్షణకు చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాజ్ పరిరక్షణపై పార్లమెంటరీ స్టాండర్డ్ కమిటీ నివేదిక ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని జస్టిస్ ఎంబి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. తాజ్ చుట్టూ వాయు కాలుష్య స్థాయిని గురించి ఐఐటీ కాన్పూర్ అంచనా వేసిందని, ఆ నివేదికను నాలుగు నెలల్లో అందిస్తామని ధర్మాసనానికి కేంద్రం తెలి పింది. తాజ్ దాని పరిసరప్రాంతాల్లో కాలుష్యానికి కారణాలను గుర్తిం చడానికి ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశామని, దానిని నిరోధిం చడానికి చర్యలు తీసుకుంటామని కేంద్రం ధర్మాసనం ముందు విన్నవించింది. దీనిపై తదుపరి విచారణ ఈ నెల 31న చేపట్టనున్నది.