Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వీధిని పడుతున్న కుటుంబాలు.. పట్టించుకొని ప్రభుత్వాలు
- సేద్యానికి 1.5కోట్ల మంది దూరం
నూఢిల్లీ : దేశంలో అనేక ప్రాంతాల్లో కరువు రక్కసి విళయతాండం చేస్తోంది. అన్నం పెట్టే అన్నదాతలను ఆత్మహత్య దిశగా పురిగొల్పోతోంది. కరవు దెబ్బకు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, వారి కుటుంబాలు వీధిని పడుతున్నాయి. కరువు పునరావస ప్యాకేజీని విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 1980 నుంచి దేశంలో 59,300 అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు అంచనా. ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని కొంతమంది పరిశోధ కులు పేర్కొంటున్నారు. కేవలం కరువు, రుణాలు కారణంగానే దేశంలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలో వ్యవసాయం ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవ సాయం 14 శాతంగా ఉన్నది. అయినా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డం కొంతమంది ఆశ్చర్యం కలిగిం చవచ్చు. రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం వారు రుతుపవనాలపై ఎక్కువ ఆధారపడ్డమే ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. 2014 నుంచి రుతుపవనాలు ఆశాజనకంగా లేవు. దీనికి తోడు కేంద్ర,రాష్ట్రపాలకుల నిర్లక్ష్యం వెరసి రైతుబతుకును నిట్టనిలువునా ముంచు తున్నదని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈశాన్య రుతుపవనాలు కాలం జూన్ నుంచి సెప్టెంబరు వరకూ, నైరుతీ రుతుపవనాలు కాలం ఆక్టోబర్ నుంచి డిసెం బరుగా ఉంది. అయితే నాలుగు ఏండ్ల నుంచి రుతుపవనాలు కలిసిరాకపోవడంతో తమిళనాడు కరవు విజృంభిస్తోంది. గత 140 ఏండ్లలో చూడని తీవ్ర కరవును ప్రస్తుతం తమిళనాడు అనుభవిస్తోంది. సహాయం చేసా మని తమిళనాడు ప్రకటించినా చాలా కొద్ది మొత్తంలో సహాయం లభిస్తోంది. తమిళనాడులోనే కాదు దేశంలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉన్నది. ప్రపంచ జల నిర్వహణ సంస్థ అంచనా ప్రకారం భారత్‌లో సగానికి పైగా ప్రాంతం కరువు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒక అంచనా ప్రకారం కరువు కారణంగా దేశంలో ఇప్పటికే 1.5కోట్లమంది రైతులు వ్యవసాయాన్ని వదిలివేశారు. ఈ సంస్థ నివేదిక ప్రకారం దేశంలో అతిపెద్ద నది గంగా కూడా క్షీణిస్తోంది. గంగానదిలో నాలుగు వంతు క్షీణిస్తుండటంతో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉత్తర భారత దేశంలో భూగర్భ జలాలు దిగజారాయని నివేదిక వెల్లడించింది. పైగా ఇక్కడ భూగర్భ జలాల్లో ఆర్సెనిక్, ఫ్లోరైడ్ వంటి విష స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. గత కొన్ని ఏళ్లలో ఉష్ణోగ్ర తలు పెరగడం కూడా కరువుకు కారణంగా ఉంది. 2050 నాటికి మరో 5 డిగ్రీల సెలియస్‌ల ఉష్ణోగ్రత పెరుగు తున్నదని నిపుణులు చెబుతున్నారు.అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఇప్పటికే ఏడాదికి 12.6 మిలియన్ల మరణాలు సంభవి స్తున్నాయి. 2030, 2050 నాటికి ఈ మరణాలు మరింతగా పెరుగుతాయి.భారత్‌లో రైతుల ఆత్మహ త్యలకు, ఆధిక ఉష్ణోగ్రతలకు కూడా సంబంధ ఉందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన అధ్యయనం వెల్లడైంది. ఒకరోజులో ఒక డిగ్రీల సెలియస్ ఉష్ణోగ్రత పెరిగితే 67 ఆత్మహత్యలు జరుగుతాయని అధ్యయనంలో తెలిపింది.